నాదెండ్ల మాట కాకినాడలో అందరి నోటా

కాకినాడ సిటీ నియోజకవర్గం: ఇంచార్జ్ ముత్తా శశిధర్ ఆదేశాల మేరకు నాదెండ్ల మనోహర్ మాట కాకినాడలో అందరి నోటా కార్యక్రమం శుక్రవారం తిలక్ స్ట్రీట్ వద్ద పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వాసిరెడ్డి శివ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న మోసాలు ప్రజలకు తెలియపరిచి ఈ రాష్ట్రాన్ని వైసిపి విముక్త ఆంధ్ర ప్రదేశ్ గా చేయడం కోసం కాకినాడ నగరంలో అన్ని కూడలుల వద్ద ఈ కార్యక్రమాన్ని చేస్తున్నామని, జగన్మోహన్ రెడ్డి చేస్తున్న మోసాల సంఖ్య రోజురోజుకి పెరుగుతూనే ఉందని ప్రతి సంక్షేమ పథకంలో తను, తన ఆదాయం పెంచుకునే మార్గాలు వెతుక్కుంటున్నాడని రాష్ట్ర ప్రజలు సంక్షేమాన్ని గాలికి వదిలేసాడని ఆయన విమర్శించారు. రాష్ట్రం ఒకపక్క అప్పులు ఊబిలో కూలిపోయి నష్టాల పాలైతే ఆయన మాత్రం హ్యాపీగా తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చుని ఎంజాయ్ చేస్తున్నారని ఆయన విమర్శించారు, ఎమ్మెల్యేలు అందరూ జగన్మోహన్ రెడ్డి మొహం చూసి గెలిచారని గతంలో చెప్పిన ఆయన ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎందుకు మారుస్తున్నాడని ప్రశ్నించారు. జగన్ మోహన్ రెడ్డి పాలన నుంచి ఈ రాష్ట్ర ప్రజలను బయటకు పడేయగల సత్తా ఒక పవన్ కళ్యాణ్ గారికి ఉందని వచ్చే ఎన్నికల్లో వైసీపీని తన్ని తరిమేస్తారని ప్రజలు ఆ అవకాశం కోసం వెయిట్ చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆకుల శీను వాసిరెడ్డి సతీష్ సాయి యాదవ్ అజయ్ యాదవ్ ముత్యాల దుర్గాప్రసాద్ శివాజీ యాదవ్ చీకట్ల వాసు యశ్వంత్ పెద్దిరెడ్డి ఉదయభాస్కర్ వారి పల్లి రాము వరద దొరబాబు సతీష్ హైమావతి మరియ సత్యవతి తదితరులు పాల్గొన్నారు.