కరోనా టెస్ట్ చేయించుకున్న నాగ్.. టెన్షన్ లో బిగ్ బాస్ హౌస్, బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్

ఎన్నో జాగ్రత్తల మధ్య బిగ్ బాస్ 4 తెలుగు షో సక్సెస్ ఫుల్ గా నడుస్తోంది. కంటెస్టెంట్స్, గెస్ట్స్ అందర్నీ క్వారెంటైన్ చేసి మరీ హౌజ్ లోకి పంపించారు. కానీ చిరంజీవి కరోనా సోకటంతో ఇప్పుడు బిగ్ బాస్ షో నిర్వాహకులు కూడా టెన్షన్ పడుతున్నట్లు ప్రచారం సాగుతుంది. దీనికి కారణం, ఇటీవల నాగార్జున వైల్డ్ డాగ్ షూటింగ్ కంప్లీట్ చేసుకుని హైదరాబాద్ రావడం… ఆతర్వాత చిరంజీవితో కలిసి సీఎం కేసీఆర్ ని కలవడం తెలిసిందే. ఆతర్వాత చిరంజీవి తనకు కరోనా పాజిటివ్ అని తెలిసిందని… తనని కలిసిన వాళ్లు కూడా కరోనా టెస్ట్ చేయించుకోవాలని సోషల్ మీడియా వేదిక ద్వారా తెలియచేయడం జరిగింది. ఈ నేపథ్యంలో  నాగార్జున కరోనా టెస్ట్ చేయించుకున్నారని తెలిసింది. రిజెల్ట్ రావాల్సివుంది. అయితే.. నాగార్జున కరోనా టెస్ట్ చేయించుకున్నారు అని తెలియగానే.. బిగ్ బాస్ హౌస్ తో పాటూ..  బాలీవుడ్ లోని ఓ ప్రొడక్షన్ హౌస్ కూడా టెన్షన్ పడుతుందట. అదేంటి అనుకుంటున్నారా..? నాగార్జున బాలీవుడ్ మూవీ బ్రహ్మస్తలో నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ లో నాగార్జున పాల్గొనాల్సివుంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంటారు అనుకున్నారు.

ఇంతలో.. నాగ్ కరోనా టెస్ట్ చేయించుకోవాల్సి రావడంతో టెన్షన్ పడుతున్నారు. ఈరోజు నాగార్జున కరోనా టెస్ట్ రిజెల్ట్ రానుంది. ఈ రిజెల్ట్ ను బట్టే నాగార్జున బిగ్ బాస్ షో షూటింగ్, బ్రహ్మస్త్ర మూవీ షూటింగ్ ఆధారపడి ఉంటుంది. మరి.. నాగ్ కి కరోనా టెస్ట్ లో ఏ రిజెల్ట్ వస్తుందో చూడాలి.