సర్వేపల్లిలో ఘనంగా నాగబాబు జన్మదిన వేడుకలు

సర్వేపల్లి: వెంకటాచలం మండలం, సర్వేపల్లి గ్రామంలో ఉన్న జనసేన పార్టీ కార్యాలయంలో ఆదివారం జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు జన్మదినాన్ని పురస్కరించుకొని సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు ఆధ్వర్యంలో జనసేన నాయకులు, జనసైనికులు కలిసి కేక్ కట్ చేసి పెద్ద ఎత్తున నాగబాబు జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా బొబ్బేపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ జనసేన, తెలుగుదేశం పార్టీలు కలిసి రాబోయే ఎన్నికల్లో ప్రజా ప్రభుత్వాన్ని స్థాపించడం ఖాయం. ఒకే తాటిపై విజయకేతనంగా రిజర్వేషన్ దానికి అడుగు ముందుకు వేస్తుంది. అందులో భాగంగా మేమంతా కూడా పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లో తీసుకెళ్లడానికి అందరం కలిసికట్టుగా పనిచేస్తాం. వైసీపీ అరాచక పరిపాలన రోజురోజుకు పెరిగిపోయి సామాన్య ప్రజలకు రక్షణ లేకుండా పోయింది. గత రెండు రోజుల క్రితం చూస్తే ఆర్టీసీ డ్రైవర్ని అరాచకంగా, అన్యాయంగా దాడి చేయడం చాలా అమానుషం. ఇది చాలా బాధాకరమైన విషయం. ఈ విషయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తే ఇంతకంటే ఎక్కువ నేరాలు, ఘోరాలు, అరాచకాలు ఉంటాయి. ఉంటాయి అనడం కన్నా జరుగుతాయి. కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించి టీడీపీ, జనసేన పార్టీలు కలిసి ఏర్పాటు చేసే ప్రజా ప్రభుత్వానికి మద్దతు పలకండి. ఈ కార్యక్రమంలో స్థానికులు జనసేన పార్టీ పినిశెట్టి మల్లికార్జున్, ముత్తుకూరు మండల సీనియర్ నాయకులు రహీం, అశోక్, నరసింహులు, రవి, రహమాన్, రాజేష్, వంశీ, సాయి తదితరులు పాల్గొన్నారు.