కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ప్రభుత్వం నుండి ఆసరా కల్పించాలనే ఉద్దేశంతో దేశంలో దీనదయాల్ అంతోద్యయ యోజన ద్వారా ఉపాది మరియు ఉద్యోగ కల్పనకై ప్రతి కార్పొరేషన్, మున్సిపాలిటీలలో మున్సిపల్ కమిషనర్ ని చైర్మెన్‌గా ఎంపిక చేసి స్దానిక అధికారులతో ఒక కమిటీని ప్రకటించడం జరిగింది. ఈ కమిటిలో భాగంగా ఆజాద్ పౌండేషన్ (ఎన్ జి ఓ) అధ్యక్షులు యల్లమిల్లి నాగ సుధా కొండల రావుని మెంబర్ గా అమలాపురం మరియు ముమ్మిడివరం మున్సిపాలిటీలలో ఎంపిక చెయ్యడం జరిగింది. ఈ కమిటీ సభ్యులు స్థానికంగా ఉన్న నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు మరియు ఉపాది అవకాశాలు ప్రభుత్వ సబ్సిడీ లోన్ల ద్వారా వ్యాపార అవకాశాలు అందిచడమే ప్రధాన ఉద్దేశంతో పనిచేస్తుంది అని తెలిపారు. కమిటీ మెంబర్ గా నాగ సుధా కొండని ఎంపిక చెసిన సందర్భంగా ఆజాద్ పౌండేషన్ సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు.
Share this content:
Post Comment