నిహారిక పెళ్లి వేళ నాగబాబు ఎమోషనల్ పోస్ట్

మెగా బ్రదర్ నాగబాబు గారాల కూతురు నిహారిక పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది.  చైతన్య, నిహారిక మెడలో మూడు ముళ్లు వేశారు. నిహారిక ఎరుపు రంగు చీరలో పెళ్లి కుమార్తెగా ముస్తాబయ్యారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ ప్యాలెస్‌ లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది.

ఈ సందర్భంగా నాగబాబు భావోద్వేగానికి లోనయ్యారు.. ట్విటర్‌లో ఓ ఎమోషనల్ పోస్ట్ చేశారు. `తను స్కూలుకు వెళ్లిన మొదటి రోజు నాకింకా గుర్తుంది. నా చిన్నారి కూతురు స్కూలుకు వెళ్లేంత పెద్దదై పోయిందనే నిజం నమ్మడానికే నాకు చాలా ఏళ్లు పట్టింది. ఈసారి ఇంకెన్నాళ్లు పడుతుందో.. కాలమే నిర్ణయిస్తుంద`ని నాగబాబు ట్వీట్ చేశారు.

నిహారిక-చైతన్య పెళ్లి వేడుకలకు ఇరు కుటుంబాలకు చెందిన కుటుంబ సభ్యులతో పాటు కొంత మంది అతిథులు హాజరయ్యారు. ఇప్పటికే నిహారిక పెళ్లిలో మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్ కళ్యాణ్‌లతో పాటు అల్లు అరవింద్ ఫ్యామిలీ మెంబర్స్ సందడి చేసారు. మరోవైపు నిహారిక పెళ్లిలో పవన్ కళ్యాణ్ కుమారుడు అకిరానందన్, కూతురు ఆద్య స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. ఆ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.