అనంత పర్యటనలో జనసేన పీఏసీ సభ్యులు నాగబాబు

అనంతపురంలో కలెక్టరేట్ నుంచి చెరువుకట్ట మీదుగా బుక్కరాయ సముద్రం వెళ్ళే దారి అధ్వాన్నంగా ఉన్న నేపథ్యంలో జనసేన జిల్లా అధ్యక్షులు టీ.సీ. వరుణ్ నేతృత్వంలో నాగబాబు స్వయంగా పాల్గొని గుంతలు పూడుస్తారని తెలిసి అప్పటికప్పుడు రోడ్డు మరమ్మతులు ప్రారంభించారు. అనంతరం అని ఒక ప్రైవేటు హోటల్లో ఏర్పాటు చేసిన వీరమహిళా సమావేశంలో అదేవిధంగా కార్యకర్తల సమావేశంలో పాల్గొని రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు ప్రజల పడుతున్న ఇబ్బందు ముఖ్యంగా మహిళలు పడుతున్న ఇబ్బందులు, అదేవిధంగా రాబోయే ఎన్నికల్లో అన్ని కులాలను కలుపుకొని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రి చేసే విధంగా ఏ విధంగా పనిచేయాలి. ఈ రాష్ట్రాన్ని ఈ రాక్షస పాలన నుండి ఎలా కాపాడాలి అన్న విషయాల మీద దిశా నిర్దేశం, సూచనలు ఇవ్వడం జరిగినది. అనంతరం కర్ణాటక చింతామణికి సంబంధించిన జనసేన క్యాలెండర్లను ఆవిష్కరించిన నాగబాబు ను గజమాలలతో ఉమ్మడిచిత్తూరు జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి దారం అనిత సత్కరించారు. ఈ కార్యక్రమాలలో బాలాజీ ఉమేష్ ప్రసన్న, ఆనంద జీవి గిడ్డు, వైట్ ఫీల్డ్ చింతామణి చెందిన జనసేన నాయకులు, రాయలసీమ జిల్లాల వీరమహిళలు, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.