యూరప్ సేన పోస్టర్ ఆవిష్కరించిన నాగబాబు

హైదరాబాద్, మార్చ్ 14 పిఠాపురం నియోజకవర్గం చిత్రాడ వేదికగా జనసేన పార్టీ ఆవిర్భావ సభ జరగనున్న విషయం విధితమే. ప్రపంచవ్యాప్తంగా జనసేన శ్రేణులు జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని పండుగలా నిర్వహించుకుంటారు. ఆ వేడుకలలో భాగంగా యూరప్ సేన ఆధ్వర్యంలో యూరప్ లోని జర్మనీ, ఐర్లాండ్, ఫిన్‌లాండ్ మరియు పోలాండ్ దేశాలలో మార్చ్ 15 వ తేదీన జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించనున్నారు. ఈ వేడుకలలో భాగంగా వేడుకకు సంబందించిన పోస్టర్లను శనివారం జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి మరియు పిఏసి సభ్యులు కొణిదెల నాగబాబు ఎన్నారై జనసేన నాయకులు, యూరప్ సేన సభ్యులు మరియు జె.ఎస్.పి గ్లోబల్ టీమ్ సభ్యుల ఆధ్వర్యంలో ఆవిష్కరించడం జరిగింది. అనంతరం యూరప్ సేన చేస్తున్న పలు అంశాలపై మరియు యూరప్ లో జనసేన పార్టీ బలోపేతం చేయడం గురించి చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జర్మనీ ఎన్నారై నాయకులు చంద్రమోహన్ శివాల, చిక్కాల రాజకుమార్, ఇటలీ జనసేన నాయకులు గుగ్గిలపు రమేష్, వీరమహిళ సుధ గుగ్గిలపు మరియు నాయుడు నిమ్మకాయల పాల్గొనడం జరిగింది.

WhatsApp-Image-2025-03-01-at-11.21.26-AM-1024x768 యూరప్ సేన పోస్టర్ ఆవిష్కరించిన నాగబాబు

Share this content:

Post Comment