నాగార్జున పుట్టిన రోజు సందర్భంగా నాగచైతన్య ‘థ్యాంక్యూ’

అక్కినేని కుటుంబం అంతా కలసి తెరపై కనువిందు చేసిన సినిమా ‘ మనం ‘. ఈ సినిమా అక్కినేని కుటుంబానికి మొమోరబుల్ సినిమాగా నిలిచింది. అనంతరం విక్రమ్ కుమార్ అక్కినేని అఖిల్ తో ‘హలో’ సినిమా చేశాడు. అయితే ఈ సినిమా ప్రేక్షకుల ఆదరణ పొందలేదు. అయినప్పటికీ విక్రమ్ కుమార్ దర్శకత్వ ప్రతిభపై నమ్మకం ఉంచి ఆయన రూపొందించే మరో సినిమాలో నటించేందుకు నాగచైతన్య అంగీకరించారు. నాగ చైతన్యకు విక్రమ్ కథ వినిపించగా.. కథ నచ్చి ఆయన నటించేందుకు అంగీకరించారు. నాగార్జున పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాకు ‘థ్యాంక్యూ’ అనే టైటిల్ ను పెట్టారు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. ‘మనం’ తర్వాత నాగచైతన్య, విక్రమ్ కుమార్ కాంబినేషన్ లో వస్తున్న రెండో సినిమా ఇది కావడం గమనార్హం. ఇదిలా ఉండగా ప్రస్తుతం నాగ చైతన్య శేఖర్ కమ్ముల రూపొందిస్తున్న ‘లవ్ స్టోరి’లో నటిస్తున్నారు. దర్శకుడు పరశురామ్ దర్శకత్వంలో కూడా నాగ చైతన్య నటించేందుకు అంగీకరించారు. ఈ రెండు సినిమాలు పూర్తయిన తర్వాత విక్రమ్ కుమార్ రూపొందించే ‘థ్యాంక్యూ’ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.