నాగచైతన్య- విక్రమ్ కాంబినేషన్‌

అక్కినేని వారసుడు నాగచైతన్య తనకు ‘మనం’ వంటి అద్భుతమైన సినిమా అందించిన విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా ఓకే చేశాడు. వీరి కాంబినేషన్‌లో తెరకెక్కే సినిమాకు ‘థాంక్యూ’ అనే టైటిల్ ఖరారు చేసినట్లు ప్రకటించారు. విక్రమ్ ఇంతవరకు చేసిన సినిమాలన్నిటి కంటే ఈ సినిమా కాస్త డిఫరెంట్ గా ప్లాన్ చేసినట్లు తెలిసింది. ప్రస్తుతం ఈ సినిమా ఫుల్ బౌండ్ స్క్రిప్ట్‌ను తయారు చేసే పనిలో పడ్డాడట డైరెక్టర్. ఇంతవరకు లవర్ బాయ్‌గా మెప్పించిన నాగచైతన్య ఫస్ట్ టైమ్ ఓ హారర్ నేపథ్యంలో ఈ సినిమా చేయనున్నాడని సమాచారం. కరోనా వ్యాప్తి తగ్గిన తర్వాత ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది.