నెల్లూరులో నక్ష ప్రారంభం

నెల్లూరు, పట్టణాలు, నగరాల్లోని అణువణువు ఇకపై డిజిటల్‌ రూపంలో నిక్షిప్తం కానుంది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో డిజిటల్‌ ఇండియా ల్యాండ్‌ రికార్డ్స్‌ మాడరనైజేషన్‌ కార్యక్రమంలో భా­గంగా ‘నేషనల్‌ జియో స్పేషియల్‌ నాలెడ్జ్‌ బేస్డ్‌ ల్యాండ్‌ సర్వే ఆఫ్‌ అర్బన్‌ హ్యాబిటేషన్స్‌ (నక్ష)’ కార్యక్రమాన్ని చేపట్టింది. మంగళవారం దేశవ్యాప్తంగా రెండు లక్షల వరకు జనాభా ఉన్న 152 మున్సిపాలిటీల్లో పైలట్‌ ప్రాజెక్టు ప్రారంభ కార్యక్రమంలో భాగంగా నెల్లూరు జిల్లా మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో మంగళవారం నక్ష డ్రోన్ ఫ్లైట్ ని నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసుల రెడ్డి, మునిసిపల్ కమీషనర్ సూర్యతేజ చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో, జనసేన సీనియర్ నాయకులు నూనె మల్లికార్జున యాదవ్, డిప్యూటీ మేయర్ సయ్యద్ తహసీన్, వై.రవికుమార్, మరియు నెల్లూరు జిల్లా మునిసిపల్ ఆఫీసర్స్, ఎంప్లాయిస్, తదితరులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment