శంకర్ గౌడ్ తో నల్గొండ జిల్లా జనసైనికుల సమావేశం

హైదరాబాద్ కేంద్ర కార్యాలయంలో మార్చి-14 న జరగనున్న ఆవిర్భావ దినోత్సవం వేడుకలు, క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం గురించి తెలంగాణ రాష్ట్ర ఇన్ ఛార్జ్ శంకర్ గౌడ్ తో ఉమ్మడి నల్గొండ జిల్లా జనసైనికులు సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు అర్హం ఖాన్, రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు లక్ష్మణ్ గౌడ్, రాష్ట్ర విద్యార్ది విభాగం అధ్యక్షులు సంపత్ నాయక్, రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు కావ్య మరియు ఉమ్మడి నల్గొండ జిల్లా అధ్యక్షులు సరికొప్పుల నాగేశ్వరరావు, జిల్లా కమిటీ సభ్యులు, విద్యార్ది విభాగం సభ్యులు మరియు యువజన విభాగం సభ్యులు పాల్గొన్నారు.

This image has an empty alt attribute; its file name is WhatsApp-Image-2022-03-05-at-8.41.37-PM-1024x576.jpeg