ఇంటిని జనసేన పార్టీ నిలయంగా మార్చిన నల్గొండ జనసైనికుడు

నల్గొండ నియోజకవర్గానికి చెందిన జనసైనికుడు పున్నం రాంబాబు (పవన్ కళ్యాణ్) తన పేరును పవన్ కళ్యాణ్ గా పిలవబడే జనసైనికుడు అప్పాజీ పేట గ్రామంలో తన ఇంటిని జనసేన నిలయంగా మార్చి జనసేన పార్టీ మీద మరియు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద ఉన్న అభిమానాన్ని చాటుకున్నాడు. పార్టీ మొదలు పెట్టిన నాటి నుండి పార్టీ కోసం చాలా కష్ట పడుతూ పార్టీని ముందుకు తీసుకెళ్తున్నాడు. నల్గొండ నియోజకవర్గ జనసేన నాయకులు కాంపల్లి వెంకట్ మరియు జనసైనికులు వారి ఇంటిని సందర్శించి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. ఇలాంటి జనసైనికులు ఉన్నందుకు గర్వపడుతున్నామని, ఇలాంటి జనసైనికుడు భవిష్యత్తులో జనసేన పార్టీ లో మంచి పదవులు సంపాదించి పార్టీని మరింత ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నామని తెలిపారు.