నలిశెట్టి శ్రీధర్ పై దాడి చేసిన వారిపై కేసు పెట్టాలని వినతి

ఆత్మకూరు నియోజకవర్గం, దువ్వూరు గ్రామంలో ఎటువంటి బిల్లులు, అనుమతులు లేకుండా ఇసుక అక్రమంగా తరలిస్తున్న లారీలను ఆపినందుకుగాను జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి నలిశెట్టి శ్రీధర్ పై గత వారంలో జరిగిన దాడిపై కేసు పెట్టి దోషులపై ఇప్పటికి కేసు పెట్టలేదని ఫిర్యాదు చేస్తూ జనసేన పార్టీ జిల్లా నాయకులు సోమవారం జిల్లా కలెక్టర్ ని కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది. జాయింట్ కలెక్టర్ వెంటనే స్పందించి దీని గురించి ఇంకా ఏ కేసు ఎందుకు పెట్టలేదని సంబంధిత పోలీస్ అధికారులు చేత సంగం సిఐ కి ఫోన్ చేసి కేసు పెట్టవలసిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా గునుకుల కిషోర్ మాట్లాడుతూ సామాన్యుడు సూది కొనాలన్న బిల్లు, టాక్స్ కట్టాల్సిందే, కానీ వైసీపీ నాయకులు సహజవనరుల దోచుకు తినాలంటే ఒక రూపాయి కూడా టాక్స్ కట్టాల్సిన అవసరం లేదు, బిల్లులు చూపాల్సిన అవసరం లేదు. పైపెచ్చు ప్రశ్నిస్తే వాళ్ళ వారసత్వం ఆస్థి అనుభవానికి మేము అడ్డుకున్నట్లు మా మీద దాడి. దానికి సహకరిస్తూ పోలీసు యంత్రాంగం కూడా ఇప్పటివరకు కేసులు నమోదు చేయకపోవడం దారుణం. అవినీతిని ప్రశ్నించే ధైర్యం, సమయం నీకు లేనప్పుడు చాటుగా ఓటుతో శిక్షించు. గత మూడు సంవత్సరాలుగా వైసీపీ పెత్తందారులు సహజ వనరులు దోచుకుంటున్నారు. ఈ విషయమై జనసేన పార్టీ తరఫున ఎన్నిసార్లు ప్రశ్నించినా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు చూస్తున్నారు. 5 నెలల కింద కోవూరు గ్రామంలో మినగల్లు గ్రామంలో ఇసుక అక్రమంగా తవ్వి తరలిస్తున్నారని సాక్షాదారాలతో కూడా ఒక పోలీసు అధికారిని ప్రశ్నించినా కూడా దానిపై ఇప్పటికి చర్యలు తీసుకోకపోవడం.. పైపెచ్చు మా మీదే కేసులు కట్టడం చూస్తుంటే వైసీపీ నాయకులపై చట్ట పరిమితులు ఏమి వర్తించవు అనిపిస్తుంది. గత వారంలో ఇసుక సహజ వనరుల అక్రమంగా దోచుకుని తరలించే క్రమంలో లారీలు తమ ఇళ్లపై వెళ్తూ పేదల ఇల్లు పగుళ్లు గురై కూలిపోతున్నాయి. అసలు మీ ఇసుక రవాణాకు సంబంధించిన బిల్లులు ఏవి అనుమతులు ఉన్నాయా అని న్యాయంగా ప్రశ్నించిన జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం ఇన్చార్జి మా నలిశెట్టి శ్రీధర్ పై దాడి చేయడం హేయమైన చర్య. దాడి జరిగిన విషయం ప్రపంచమంతా తెలిసినప్పటికీ ఏమీ జరగనట్టు పోలీసులు ఇప్పటిపై కేసు కేసు కట్టకపోవడం చూస్తుంటే వైసిపి మన రాష్ట్రాన్ని క్రైమ్ క్యాపిటల్ గా తయారు చేస్తుంది అనిపిస్తుంది. ఈ విషయమై దాడి చేసిన దోషులపై కేసులు కట్టాలి.అక్రమ రవాణా చేస్తున్న వారిని శిక్షించాలంటే ఎస్పీ మరియు కలెక్టర్ ని కలవడం జరిగింది. దశాబ్దాల అనుభవం కలిగిన పెద్దలు సామాజిక వాదులు వీటిని అడ్డుకోకపోవడం ఆలోచించాల్సిన విషయమే. ఈ రోజున స్థానిక గ్రామస్తులు, మరియు రాష్ట్ర ప్రజలు అనుకునే ఒకే ఒక విషయం దోపిడీని ధైర్యంగా ఎదుర్కొంటున్న జన సైనికులకు మద్దతు ఇవ్వాలని.. శ్రీధర్ అన్న మరియూ అన్న నాయకత్వంలో ధైర్యంగా నిలిచిన యువతకు స్ఫూర్తిగా స్థానిక సహజ వనరులను దోపిడీకి యువత అడ్డుకోవాల్సిన పరిస్థితి ఉంది. వైసీపీ నాయకుల దాడుల నేతృత్వంలో ప్రజలు బయటకు రాకపోయినా రేపు జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలు కచ్చితంగా ప్రజా ప్రభుత్వానికి జనసేన పార్టీకి మద్దతుగా ప్రజలందరూ ఉంటారు. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ దోపిడీ గురించి వారు చేస్తున్న దాడులు గురించి తెలుసుకొని రానున్న రోజుల్లో ఇదే ప్రభుత్వానికి మరొకసారి అవకాశం ఇస్తే రాష్ట్రంలో మనం ఉండే పరిస్థితి లేదు కాబట్టి వైసిపి పార్టీని తరిమికొట్టాలి. సహజ వనరుల కాపాడేందుకు రాష్ట్ర అభివృద్ధి సాధించేందుకు పవన్ కళ్యాణ్ కి ప్రజా ప్రభుత్వానికి జనసేన తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థులకు అవకాశం ఇవ్వాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ఏటూరు రవి, కృష్ణారెడ్డి, నలిశెట్టి శ్రీధర్, గునుకుల కిషోర్, అళహరి సుధాకర్, బొబ్బేపల్లి సురేష్, వీర మహిళ హైమావతి మరియు జనసైనికులు పాల్గొన్నారు.