‘నాంది’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్

గత కొంతకాలం గా హీరోగా వరుస ప్లాప్స్ ఎదురుకుంటున్న అల్లరి నరేష్.. తాజాగా విజయ్ కనకమేడలను దర్శకుడిగా పరిచయం చేస్తూ.. ఎస్‌.వి. 2 ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై స‌తీశ్ వేగేశ్న నిర్మాణంలో ‘నాంది’ అనే సినిమా చేసాడు. అల్ల‌రి న‌రేష్ కామెడీ శైలికి పూర్తి భిన్నంగా వినూత్న కథ, కథనాలతో తెరకెక్కిన ఈ మూవీ (ఫిబ్రవరి 19) ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ టాక్ సొంతం చేసుకుంది. మొదటివారానికి గాను ఈ మూవీ రూ. 3.47 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది.

నైజాం (తెలంగాణ)లో1.35 కోట్ల షేర్ రాబట్టగా.. సీడెడ్ (రాయలసీమ) 0.44 కోట్లు రాబట్టింది. మిగిలిన ఏపీలో ఈ చిత్రం రూ. 1.48 కోట్లను కొల్లగొట్టింది. ఇక రెస్టాఫ్ ఇండియా, ఓవర్సస్ కలిపి రూ. 20 లక్షల వరకు కలెక్షన్లు రాబట్టింది. మొత్తంగా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 3.47 కోట్లను రాబట్టి స్టడీగా కొనసాగుతుంది.