జనసేనానిని మర్యాదపూర్వకంగా కలిసిన నంద్యాల సూర్య

రాజోలు, జనసేనానిని మర్యాదపూర్వకంగా కలిసిన నంద్యాల సూర్య నియోజకవర్గంలో గత కొంతకాలంగా జరుగుతున్న రాజకీయ పరిణామాలను మరియు నియోజకవర్గంలో సమస్యల పై వివరించడం జరిగింది. అలాగే ఇతర పార్టీల నుంచి వచ్చిన స్వయం ప్రకటిత నాయకులు జనసేన పార్టీని విచ్ఛిన్నం చేసే ప్రక్రియలో భాగంగా జన సైనికులపై దాడులు చేస్తున్నారని తెలియచేయడం జరిగింది. పార్టీ ప్రస్తుతం సామాన్య ప్రజల మనసుల్లో బలంగా నాటుకపోయిన తరుణంలో కొందరు ప్రత్యద్యులతో చేతులు కలిపి ఈ దాడులకు తెగబడుతున్నారని వివరించడం జరిగింది. పార్టీ సిద్ధాంతాలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే ఉపేక్షించేది లేదని, అనుసందానం అనే బలమైన ఆయుధాన్ని ఉపయోగించి సంస్కరించాల్సిన అవశ్యకత ఉందని, క్రమశిక్షణ కలిగి నిబద్దతతో పనిచేసే సైనికులు బలమైన సమూహంగా మారి ఎన్నికలలో ఓటు అనే ఆయుధంతో ప్రత్యర్థులకు సమాధానం చెప్పాలని సేనాని సూచించడం జరిగిందని నంద్యాల సూర్య తెలిపారు.