విజయవాడ, మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లాలో తీర ప్రాంతంలో నివసిస్తున్న 110 గ్రామాల మత్స్యకారుల సమస్యలు, శిధిలావస్థకు చేరుకున్న రేవు అంపలాం వంతెన కోసం మరియు నరసన్నపేట నియోజకవర్గంలో కొన్ని సమస్యలు మరియు వాటి సర్వే రిపోర్ట్ ను పూర్తిగా వివరిస్తూ జనసేన పార్టీ అధ్యక్షులు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదల పవన్ కళ్యాణ్ కి చేరే విధంగా సహకరించాలని విన్నవించి అర్జీలను శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు పిసిని చంద్రమోహన్ కి నరసన్నపేట జనసేన నాయకులు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు పిసిని చంద్ర మోహన్, లీగల్ సెల్ ప్రతినిధి బయ్యారపు నరసింహరావు, రాష్ట్ర అధికార ప్రతినిధి పరింగిశెట్టి కీర్తన, నియోజకవర్గ ఐటీ కో-ఆర్డినేటర్ వరప్రసాద్ పొట్నూరు, పోలాకి మండలం అధ్యక్షులు నందు పిల్లి దండాసి, నరేష్, కేశవ నాయుడు, ఎల్లయ్య, వెంకటరమణ పాల్గొన్నారు.
Share this content:
Post Comment