నరసాపురం నియోజకవర్గ జనసేన విస్తృత స్థాయి సమావేశం

నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి, పీఏసీ సభ్యులు మరియు రాష్ట్ర మత్స్యకార వికాస విభాగ ఛైర్మెన్ బొమ్మిడి నాయకర్ నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, వీరమహిళలతో నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించడం జరిగింది. సమావేశంలో భాగంగా ఆయన మాట్లాడుతూ జనవరి 26వ తేదీ నుండి నరసాపురం నియోజకవర్గంలో ప్రతీ ఇల్లు, ప్రతి గ్రామం తిరిగి పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, జనసేన పార్టీ సిద్ధాంతాలు ప్రజలకు చేరువ అయ్యేలా చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి “ఇంటింటికీ జనసేన” అనే నామకరణం చేసారు. అనంతరం దోచుకోవడం తప్ప ఎక్కడా కూడా అభివృద్ధి లేదు అని వైసీపీ పాలనపై మండిపడ్డారు. అదే విధంగా రాబోయే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయ్యి జనసేన ప్రభుత్వాన్ని స్థాపిస్తారు అని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి కోటిపల్లి వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో చినిమిల్లి సత్యనారాయణ, చాగంటి మురళి కృష్ణ (చిన్న), జక్కం బాబ్జి, వలవల నాని, ఆకన చంద్రశేఖర్, కొల్లాటి గోపీకృష్ణ, వాతాడి కనకరాజు, బందెల రవీంద్ర, గుబ్బల మారియ్య, నిప్పులేటి తారకరామారావు, ఆకుల వెంకట స్వామి, తోట నాని, ఇంజేటి దానం, వాతాడి రమేష్, గంటా కృష్ణ, కోపల్లి శ్రీను, దూది బాబు, బొక్కా చంటి మరియు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, వీరమహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.