నర్సాపురం శాసనసభ్యులు మరియు ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్ అధ్యక్షతన నరసాపురం పట్టణ గవర్నమెంట్ హాస్పిటల్ అభివృద్ధి కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీలో నరసాపురానికి చెందిన ఐదుగురికి సభ్యులుగా నియమించడం జరిగింది. డా. మాదంశెట్టి కోటేశ్వరరావు, పోలిశెట్టి పుష్ప నలిని, కాగిత వేంకటేశ్వరరావు, శంకరపు వేంకటేశ్వర్లు, ఎనుముల సతీష్ గార్లకు కమిటీలో మెంబర్లుగా స్థానం కల్పించారు. ఈ కార్యక్రమంలో బిజెపి నియోజకవర్గ కన్వీనర్ మేకల సతీష్, పులపర్తి వేంకటేశ్వరరావు, హాస్పిటల్ సూపరింటెండెంట్ డా. సుప్రియ, వలవల నాని, గంట కృష్ణ, ఆకన చంద్రశేఖర్, హాస్పిటల్ సిబ్బంది, అలాగే నియోజకవర్గ జనసేన, టిడిపి, బిజెపి నాయకులు, జనసైనికులు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు. హాస్పిటల్ అభివృద్ధి కోసం కమిటీ సమగ్రంగా పనిచేసి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కట్టుబడి ఉండాలని ఈ సందర్భంగా బొమ్మిడి నాయకర్ తెలిపారు.
Share this content:
Post Comment