జనసేన, తెలుగుదేశం కలయికలో నర్సిపురం గ్రామం కేంద్రంగా నిరాహార దీక్ష

బొబ్బిలి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టు నిరసిస్తూ జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ కలయికలో నిరాహార దీక్ష నర్సిపురం గ్రామం కేంద్రంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో జనసేన పార్టీ ప్రచార కార్యదర్శి బాబు పాలూరు పాల్గొనడం జరిగింది. పార్వతీపురం జనసేన పార్టీ మండల అధ్యక్షురాలు ఆగురు మణి మాట్లాడుతూ జనసేన తెలుగుదేశం పార్టీల పొత్తు ఆంధ్రప్రదేశ్ ప్రజల మేలుకోసమే అని వైఎస్ఆర్సిపి అరాచక పాలనలో ప్రజలు పడుతున్న ఇబ్బందులు ప్రజలు అనుభవిస్తున్న బాధలు, ఇవన్నీ చూసి మా పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవడం జరిగింది. వైఎస్ఆర్సిపి నాయకులు మాట తీరు మంత్రుల మాట తీరు మా పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత దూషణలు ఇవన్నీ చూస్తూ వస్తున్నాం. మా అధినాయకుడు ప్యాకేజీ తీసుకున్నట్లయితే మీరు మీ ప్రభుత్వం నిరూపించండి. సీఎం స్థాయిలో వ్యక్తి అలా మాట్లాడితే మంత్రులు ఎమ్మెల్యేలు మేయర్లు ఎలా మాట్లాడతారు ప్రజలే అర్థం చేసుకోవాలి, ప్రజలు మేలు జరిగే విషయంపై చర్చ పెడితే బాగును ఆవి చేత కాక నాయుకుల వ్యక్తిగత విషయలపై చర్చ పెట్టడం వాళ్ల అవివేకం తెలిజేస్తుంది అన్నారు. ఈ కార్యక్రమంలో సీతానగరం మండల అధ్యక్షులు పాటీ శ్రీను, బొబ్బిలి మండల అధ్యక్షులు గంగాధర్, జనసేన వీర మహిళలు బోనులు గోవిందమ్మ, ఖాతా విశ్వేశ్వరరావు, చిట్లి గణేశ్వరరావు, గుంట్రెడ్డి గౌరీ శంకర్, గణేష్, కర్రి మణికంఠ, పైలా శ్రీను, అక్కెన భాస్కర్, అంబటి బలరాం, తిరుమలరెడ్డి కనకరాజు, పాత్ర పవన్, అన్నబత్తుల దుర్గాప్రసాద్, మాచర్ల శేఖర్, బొప్పడపు గోపాల్, బాలి తిరుపతిరావు, తాన శ్రీను, చలపతి నూకరాజు, ప్రదీప్, అనిల్, అశోక్, సంతు, పైళ్ల అప్పలరాజు, బి ప్రసాద్, బి చంద్ర, దుర్గా, శంకర్, ప్రశాంత్, సాయి, మహేష్, జనసేన పార్టీ కార్యకర్తలు అలాగే సీతానగరం జనసేన నాయకులు, చిప్పాడ సూర్యనారాయణ, వై అచ్చుతా నాయుడు, జయశంకర్, సాయి కిషన్, సీతానగరం నాయకులు జనసైనికులకు, బొబ్బిలి జనసేన నాయకులకు, జనసైనికులకు అందరికీ పేరుపేరునా ధన్యవాదములు తెలిపారు. అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ పాల్గొని ఈ ప్రోగ్రాం విజయవంతం చేశారు.