◆ డాక్టర్ కందుల ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు
◆ వివిధ రంగాలలో ప్రతిభావంతులైన మహిళలకు సత్కారం
మహిళా సాధికారతతోనే దేశాభివృద్ధి సాధ్యం అని విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీ కృష్ణ శ్రీనివాస్ అన్నారు. శనివారం అల్లిపురం నెరేళ్ల కోనేరు వద్ద దక్షిణ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు, 32వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా, అంతరిక్షంలో ఉన్న సునీతా విలియమ్స్ క్షేమంగా భూమికి తిరిగి రావాలని ప్రార్థనలు చేశారు. అనంతరం, వివిధ రంగాలలో ప్రతిభావంతులైన మహిళలను ఎమ్మెల్యే వంశీ కృష్ణ శ్రీనివాస్ చేతుల మీదుగా సత్కరించారు. ఎమ్మెల్యే వంశీ కృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ, సమాజంలో నేడు మహిళలు ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నారని, ఏ సమస్యొచ్చినా ధైర్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. రోజురోజుకూ మహిళలపై అఘాయిత్యాలు పెరుగుతున్నాయని, వాటి నివారణకు విద్యార్థినులు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని అన్నారు. గతంలో ఇంటికి పరిమితమైన మహిళలు నేడు ఎదురులేని నారీ శక్తిగా మారారని కొనియాడారు. మహిళలు ఐక్యంగా ఉంటూ ఒకరికొకరు సహాయం అందించుకోవాలని సూచించారు. డాక్టర్ కందుల నాగరాజు మాట్లాడుతూ, కుటుంబం, దేశాభివృద్ధి కొరకు మహిళా సాధికారత ఎంతో అవసరమని, మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడు దేశం ఎంతో అభివృద్ధి చెందుతుందని చెప్పారు. కుటుంబ అభివృద్ధి మహిళల చేతిలోనే ఉంటుందని, మహిళలకు ఆర్థికపరమైన అంశాలపై సంపూర్ణ అవగాహన ఉండాలని అన్నారు. సమాజంలో మహిళలు అభివృద్ధి చెందినప్పుడే దేశం కూడా అభివృద్ధి చెందుతుందని, మహిళలతోనే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. ప్రభుత్వం త్వరలో ‘తల్లికి వందనం’ కార్యక్రమం ద్వారా మహిళలకు అండగా నిలవనుందని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ల సారథ్యంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా వెళ్ళిపోతుందని పేర్కొన్నారు. అలాగే, భారత మూలాలు ఉన్న సునీతా విలియమ్స్ నాసా ద్వారా అంతరిక్షంలో వెళ్లి కొన్ని నెలలు అక్కడ ఉండనున్నారని, ఆమె క్షేమంగా భూమికి తిరిగి రావాలని అభిలాషించారు. జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ, ప్రతీ ఏడాది క్రమం తప్పకుండా డాక్టర్ కందుల నాగరాజు ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారని కొనియాడారు. ఆయన ఎన్నో మంచి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారని చెప్పారు. భవిష్యత్తులో ఆయన ఆధ్వర్యంలో మరిన్ని మంచి కార్యక్రమాలు జరగాలని ఆశించారు. ఈ కార్యక్రమంలో 33వ వార్డు కార్పొరేటర్ భీశెట్టి వసంత లక్ష్మి, 30వ వార్డు ప్రెసిడెంట్ యజ్ఞేశ్వరి, జనసేన సీనియర్ నాయకురాలు నాగలక్ష్మి, నారా అమ్మాజీ, ఆర్య వైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ కొల్లి రూపా, నారా నాగేశ్వరరావు, గోపాలపట్నం క్రైమ్ ఎస్సై గోవిందమ్మ, టూ టౌన్ ఎస్సై కాంతం, టూ టౌన్ పోలీసులు, మహిళా పోలీసులు, బిజెపి నాయకులు శాలివాహన్, కందుల రాజశేఖర్, జనసేన ఇంచార్జ్ లు లక్ష్మీ, రూపా, 39వ వార్డు ప్రెసిడెంట్ మైలపల్లి చిన్న, 32వ వార్డు జనసేన పార్టీ యువ నాయకులు కందుల బద్రీనాథ్, కందుల కేదార్నాధ్, సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Share this content:
Post Comment