అంగరంగ వైభవంగా చంద్రగిరిలో జాతీయ రైతు దినోత్సవ వేడుకలు

చంద్రగిరి: జాతీయ రైతు దినోత్సవాన్ని పురస్కరించుకుని ఝనశెన ఫర్త్య్ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ మరియు పార్టీ పెద్దలు నాదెండ్ల మనోహర్, నాగ బాబు సూచించిన విధంగా, జాతీయ రైతు దినోత్సవ వేడుకలను చంద్రగిరి నియోజకవర్గంలో అంగరంగ వైభవంగా జరపడం జరిగింది. రైతు నేస్తం అనే కార్యక్రమంలో భాగంగా, రైతులకు పొలం పరికరాలు, పనిముట్లు అందచేసి అలాగే నీటి మరియు పొలం పనులకు దోహదపదే నీటి ట్యాంకర్ ను ప్రారంభించడం జరిగింది. స్థానికంగా రైతులు ఎదుర్కుంటున్న సమస్యలను మరియు వారికి ప్రభుత్వం నుండి అందే చేయూత, సహాయం మీద ఆరాతీసి వారికి అండగా ఉంటామని చంద్రగిరి నియోజకవర్గ నాయకులు దేవర మనోహర హామీఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్.సీ పురం మండల అధ్యక్షులు సంజీవిహారి, సాయి, శ్రీకాంత్, యువి రాయల్, నియోజకవర్గ నాయకులు, మండల నాయకులు, వీరమహిళలు ఆశా, లావణ్య, జనసైనికులు పాల్గొన్నారు.