ఆమదాలవలస జనసేన ఆధ్వర్యంలో జాతీయ రైతు దినోత్సవ వేడుకలు

ఆమదాలవలస: జాతీయ రైతుల దినోత్సవం సందర్భంగా జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు ఆమదాలవలస నియోజకవర్గ ఇంచార్జ్ రామ్మోహన్ రావు ఆదేశాలతో ఆమదాలవలస నియోజకవర్గ నాయకులు పైడి మురళి మోహన్ మరియు కార్యకర్తల ఆధ్వర్యంలో శుక్రవారం ఆమదాలవలస పరిదిలోని రైతుల దగ్గరకు వెళ్లి జాతీయ రైతుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసి, రైతులను జనసేన పార్టీ తరుపున గౌరవంగా సన్మానించడం జరిగింది. అంతరం వారు ఎదుర్కొంటున్న సమస్యల తెలుసుకొని, జనసేన అధినేత రైతన్నలకు చేసిన సేవలను వివరించి, జనసేన ప్రభుత్వం ఏర్పడ్డాక ఏ విదంగా రైతులకు అండగా ఉంటారో వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు దనుజయరావు, విజయ్, ఈశ్వర రావు, రాజారావు, కోటేషే, రాము, గోవింద్, తదితరులు పాల్గున్నారు.