తిరువూరు జనసేన ఆధ్వర్యంలో జాతీయ రైతు దినోత్సవ వేడుకలు

తిరువూరు: జనసేన పార్టీ ఆధ్వర్యంలో తిరువూరు నియోజకవర్గం, తిరువూరు మండలంలోని జి.కొత్తూరు గ్రామము మరియు గంపలగూడెం మండలంలోని ఆర్లపాడు గ్రామాల పరిదిలోని రైతులతో శుక్రవారం జాతీయ రైతు దినోత్సవ సందర్భంగా జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు గంపలగూడెం మండల అధ్యక్షులు వెంకట కృష్ణ, తిరువూరు మండల అధ్యక్షులు పుల్లారావు, పగడాల లక్ష్మణరావు ఆధ్వర్యంలో రైతు దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగినవి. ఆర్లపాడులో గ్రామంలో కొంకి ప్రసాద్ మరియు పసుపులేటి సాంబశివరావు పొలాలను మరియు జి కొత్తూరు పగాడాల రామారావు పొలములో జనసేన పార్టీ నాయకులు రైతు దినోత్సవ వేడుకల్లో భాగంగా వారి యొక్క స్థితిగతులను అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఉమ్మడి కృష్ణ జిల్లా ఉపాధ్యక్షులు శ్రీకాంత్ మాట్లాడుతూ.. రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుందని, అలాంటిది రైతే కన్నీరు పెడితే రాష్ట్రానికి మంచిది కాదని ఈ రైతు దినోత్సవం రోజున రైతుల్ని సత్కరించుకోవడం పవన్ కళ్యాణ్ గారు సూచించినటువంటి విధానం మంచిదని కొనియాడడం జరిగింది. అలాగే రైతు చనిపోతే ఏ ఒక్క పార్టీ కూడా ముందుకు రాలేదు, అధికారం లేకపోయినా తన కష్టార్జితం వెచ్చించి 30 కోట్ల రూపాయలతో 3 వేలు మంది చనిపోయిన కవులు రైతులకు ఇవ్వడానికి ముందుకు వచ్చి ఇప్పటి వరకూ రాష్ట్రవ్యాప్తంగా 650 కుటుంబాలకు 6 కోట్ల 50 లక్షల రూపాయలు ఇచ్చిన ఘనత మన పవన్ కళ్యాణ్ గారిది అలాంటి నాయకుడిని మనకు ముఖ్యమంత్రి ఐతే ఎంతో మేలు జరుగుతుంది. రైతులకు అండ పవన్ కళ్యాణ్ గారు మాత్రమే, అందుకని వచ్చే ఎన్నికల్లో ఓటు వేసే ముందు మన భవిష్యత్ గురించి ఆలోచించి అందరూ జనసేన పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నాను అని శ్రీకాంత్ అన్నారు. గంపలగూడెం మండల పార్టీ అధ్యక్షులు మాట్లాడుతూ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే నియోజకవర్గానికి ఒక కోల్డ్ స్టోరేజ్ నిర్మాణం చేస్తానని రైతుకి కొంత సహాయాన్ని అందిస్తానని, రైతుబంధు తీసుకొస్తానని కళ్ళ కబుర్లు చెప్పి కాలయాపన చేసి ఏ ఒక్క పథకం కూడా రైతులకు వర్తించకుండా అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంతవరకు కూడా ఒక నియోజకవర్గంలో కూడా కోల్డ్ స్టోరేజ్ నిర్మాణం చేపట్టలేదు. గ్రామీణ ప్రాంతాల్లో అధికారులు గతంలో పొలంలోకి వెళ్లి ఎంపీలు గాని, ఏఈవోలు గాని హార్టికల్చర్ అధికారులు కానీ గతంలో పొలాల దగ్గరికి వెళ్లి వారి స్థితిగతులు తెలుసుకునేవారు. కేవలం రైతు భరోసా కేంద్రాలు కేవలం నామమాత్రంగానే ఉన్నాయి. కంప్యూటర్లకే సరిపోయే వారు ఈ రోజున రైతుల మీద ఏ ఒక్క అధికారి కూడా పొలాల వెంట వెళ్ళిన స్థితిగతులు లేవు, రైతులు అధిక పెట్టుబడులు పెట్టి ఆర్థికంగా నష్టపోయారని గంపలగూడెం మండలంలో సుమారు 2500 హెక్టార్లలో మిర్చి సాగు చేసి ఎకరానికి మూడు లక్షలు పెట్టుబడి పెట్టి కేవల పది కింటాల్ లోపు మిర్చి వచ్చే పరిస్థితిలో ఉన్నాయి. నల్ల తామరపు ఆశించి తీవ్రంగా నష్టపోయి రైతులు, అలాగే పత్తి రైతులు చూస్తే వరి ధాన్యం తేమ శాతం పేరుతో ఆర్బిఐ వద్ద ఆరు, ఏడు కేజీలు కట్టింగ్ జరుగుతుంది. వీటిని దృష్టిలో పెట్టుకొని మేము అధికారంలోకి రాగానే 60 సంవత్సరాల దాటినటువంటి రైతాంగానికి ఐదు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామని మా అధ్యక్షులు వారు గతంలోనే ప్రకటించడం జరిగింది. దానికి అనుగుణంగా లాభసాటి వ్యవసాయం తీసుకువచ్చే ప్రణాళిక మేము చేస్తామని, చనిపోయిన రైతు కుటుంబాలను ఆదుకుంటామని, అందరితో చర్చించి సరైన వ్యవసాయానికి ప్రాధాన్యత ఇస్తామని మేము ఈ విషయాలన్నిటిని కూడా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తామని రైతులకు భరోసా ఇవ్వడం జరిగింది. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం చేసుకునే కుటుంబాలకు ఉపాధి హామీ పథకాన్ని రైతులకు అనుసంధానంగా దవారిగూడెం సర్పంచ్ చెన్నా శ్రీనివాసరావు అన్నారు అలాగే ఈ రైతు దినోత్సవం సందర్భంగా మండలంలోని ఆర్ల పాడు గ్రామంలోని ఐదుగు రైతులను సత్కరించడం జరిగింది. వారు మాట్లాడుతూ మాకేం అవసరం లేదు అని, పంటకు గిట్టుబాటు ధర, పంట నష్టపరిహారం, రైతుగా నీరు, రైతు ఖాతాలోకి ఏదైతే సాగు చేసుకుంటున్నారో వారికి అందించాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఉమ్మడి కృష్ణాజిల్లా ఉపాధ్యక్షులు బోలియా శెట్టి శ్రీకాంత్, కార్యదర్శి మనుబోలు శ్రీనివాసరావు, తిరువూరు మండల అధ్యక్షులు, గంపలగూడెం మండల అధ్యక్షులు చింతలపాడు వెంకటకృష్ణా రావు, ప్రధాన కార్యదర్శి ఒట్టి కొండ కృష్ణ, సంయుక్త కార్యదర్శి పసుపులేటి కిషోర్, ఓరుగంటి సురేష్, మాధవరావు, తిరువూరు నియోజవర్గ నాయకులు ఉయ్యూరు జయప్రకాష్ రావు, పగడాల లక్ష్మణరావు, పసుపులేటి రవీంద్ర, గాదె వారి గూడెం సర్పంచ్ చెన్నా శ్రీనివాసరావు, పసిలేటి శ్రీనివాసరావు, దండాలు తిరుపతిరావు, పసుపులేటి మాధవరావు, పగడాల శంకర్, ముదిగుంట్ల సాయి, నియోజకవర్గ జనసేన నాయకులు హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది.