రామ శ్రీనివాస్ ఆధ్వర్యంలో జాతీయ రైతు దినోత్సవ వేడుకలు

రాజంపేట: జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా శుక్రవారం అన్నమయ్య జిల్లా రాయచోటి చివర్లో ఉన్న రైతులు పాడి రైతులతో జనసేన పార్టీ జిల్లా నాయకుడు రామ శ్రీనివాస్ ఆధ్వర్యంలో రామయ్య అనే రైతుకు సన్మానం కార్యక్రమం చేయడం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిధిగా రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వంగిమల్ల రంగారెడ్డి పాల్గొని రైతులందరికీ వారిరువురు జాతీయ రైతు దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాలకపక్ష ప్రజాప్రతినిధులు రైతు అనే పదం పేరుతో మాత్రం రైతు రాజ్యానికి వెన్నుముక లాంటి వారు అని అబ్బాదపు మాటలు నమ్మపలుకుతూ ప్రాముఖ్యంగా వాడుతారు కానీ రైతులు ఏ విధంగా నష్టపోతున్నారు అని ఏమాత్రం ఆలోచించకుండా ఒక వైపున కరువుతో మరొకవైపున వరదతో నష్టపోయిన రైతులను కనీసం వారి పట్ల కనికరించకుండా వారి పనుల పైన నిమగ్నమై ఉన్నారు అయితే మేము ఒకే డిమాండ్ చేస్తున్నాం అధికారులు కానీ పాలకులు కానీ రైతుల పైన మీకు ఏ ఒక్క దయాదాక్షణ ఉంటే కరువుతో నష్టపోయిన రైతులను సర్వే చేసి వరదతో ఒకవైపున నష్టపోయిన రైతులు పైన పూర్తి సర్వే చేయించి రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇన్సూరెన్స్ మంజూరు చేసి రైతులు తీసుకున్న రుణం మాఫీ చేసి వెంటనే మంజూరు చేయాలని రైతులకు సంబంధించిన ఎరువులు, మందులు కానీ వారికి న్యాయం జరిగే విత్తనాలు మంజూరు చేయాలని అలా లేనియెడల రైతులు తీవ్రమైన ఇబ్బందులు పడే అవకాశాలు మెండుగా ఉన్నాయని అదేవిధంగా వారు ఆత్మహత్యలకు కూడా పాల్పడే అవకాశాలు నిండుగా ఉన్నాయని గుర్తు చేశారు. రానున్న ఎన్నికలలో జనసేన, తెలుగుదేశం పార్టీలకు రైతులందరూ మద్దతు ఇవ్వాలని రాబోయే ఉమ్మడి ప్రభుత్వం ద్వారా క్షేత్ర స్థాయిలో రైతులందరిణి అన్ని రకాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ నాయకులు, జనసైనికులు, రైతన్నలు రామయ్య, పవన్, వెంకటేష్ లు, పాడిపశువుల మహిళా రైతులు పాల్గొన్నారు.