జాతీయ రైతు దినోత్సవం.. రైతులతో జనసేన నేత పోలిశెట్టి

రామచంద్రపురం నియోజకవర్గం: జాతీయ రైతుల దినోత్సవం సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు మరియు స్పూర్తితో రామచంద్రపురం నియోజకవర్గం, కాజులూరు మండలం, శీల గ్రామంలో నియోజకవర్గం జనసేన ఇంచార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో రైతులను మరియు కౌలు రైతులను కలిసి వారి యొక్క సమస్యలను తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా రైతులు వారి సమస్యలు చెప్పుకొనగా జగన్మోహన్ రెడ్డి రైతులకి ఏమి చేయలేదని, గతంలో పాదయాత్రలో వ్యవసాయ రంగానికి సంబంధించి ఇచ్చిన హామీలు ఆయన మర్చిపోయారని, ఇప్పుడు రైతుల అవసరం తీరిపోయాక మొహం చాటేస్తున్నాడని రైతులు వాపోయారు. ఈ సందర్భంగా పోలిశెట్టి చంద్రశేఖర్ మాట్లాడుతూ.. జనసేన ప్రభుత్వం వస్తే వ్యవసాయ రంగానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందని, అందుకు కారణం పవన్ కళ్యాణ్ గారికి నేరుగా వ్యవసాయ శ్రమ చేసినవారని ఆయన రైతుల ఆవేదన అర్థం చేసుకున్న నాయకుడని, రాష్ట్రంలో 3000 మంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఆ కుటుంబాలు ఆదుకోవడానికి 30 కోట్లు కేటాయించి, ఒక్కో కుటుంబానికి లక్ష చొప్పున ఇచ్చిన దేశంలో ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అని జనసైనికులు అన్నారు. జనసేన అధికారంలోకి వస్తే మేనిఫెస్టోలో భాగంగా రైతుకి నెలకి 5000 నుంచి 8000 రూపాయలు పెన్షన్ వస్తుందని, మరియు వివిధ సోలార్, ఉచిత కరెంట్ వంటి హామీలను వివరించారు. ఈ కార్యక్రమంలో రైతులు, జనసైనికులు పాల్గొన్నారు.