జాతీయ రైతు దినోత్సవం.. రైతులతో పర్చూరు జనసేన

పర్చూరు: జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా జనసేన పార్టీ ఆదేశాల మేరకు ఉమ్మడి ప్రకాశం జిల్లా, చిన్నగంజాం మండలం, కడవకుదురు గ్రామంలోనీ పొలాలలో జనసేన నాయకులు పర్యటన చేశారు. ఈ క్రమంలో మహిళా రైతులు మాట్లాడుతూ ఇటీవల పడ్డ వర్షాలకు శనగ పంటలన్నీ నాశనమైపోయాయి, వాటికి రావలసిన నష్టపరిహారం ప్రభుత్వం ఇవ్వలేదని చిన్నగంజాం మండల అధ్యక్షుడు సందు శ్రీనివాసరావు దగ్గర వాపోయారు. ఈ సందర్బంగా శ్రీనివాస రావు మాట్లాడుతూ ఏవో గారిని త్వరలోనే కలిసి మాట్లాడతానని హామీ ఇచ్చారు. యువ నాయకుల తోట అశోక్ చక్రవర్తి మాట్లాడుతూ రబీ సీజన్ కు సంబంధించి ఎం.టి.యు 1156 రకం పంటకు బీమా చేయడం జరుగుతుంది. కానీ పండించాక వాటి కొనుగోలు మాత్రం ప్రభుత్వం తీసుకోవటం లేదని ఈ ఎం.టి.యు 1156 రకం ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని, ప్రజలను దళారి వ్యవస్థ నుంచి రక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి అడుసుమల్లి హరిబాబు, జనసైనికులు కమ్మెల దినేష్, తోటకూర గోపి పాల్గొన్నారు.