జనసేన ఆధ్వర్యంలో జాతీయ రైతు దినోత్సవం

అమలాపురం, జాతీయ రైతు దినోత్సవం పురస్కరించుకుని జనసేనపార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్, పిఏసి సభ్యులు నాగబాబు ఆదేశాలమేరకు అమలాపురం నియోజకవర్గంలో పలు గ్రామాలలో రైతు దినోత్సవం జరుపుకోవడం జరిగింది. పలు చోట్ల రైతులకు సన్మానం చేయడం రైతులను కలసి రైతు సమస్యలు తెలుసుకోవడం అదేవిధంగా పవన్ కళ్యాణ్ కౌలు రైతులకు అందించే సహాయం గురించి వివరించారు. గత ప్రభుత్వాలు రైతులను మోసం చేశాయని ప్రస్తుత ప్రభుత్వంలో రైతుల పరిస్థితి మరింత అధ్వాన్నంగా తయారయిందని రైతులు వాపోయారు. ఏవిధమైన అధికారం లేకపోయినా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆత్మహత్యలు చేసుకొని మరణించిన కౌలు రైతుల కుటుంబాలకు ఆర్థికసహాయం అందజేసి ఆ కుటుంబాలను ఆదుకున్నందుకు రైతులు పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలియజేసారు. అమలాపురం నియోజకవర్గ ఇంచార్జ్ శెట్టిబత్తుల రాజబాబు సూచనలతో జనసేనపార్టీ నాయకులు మహాదశ నాగేశ్వరావు, ఆకుల బుజ్జి, కుంపట్ల రమేష్, చిక్కం సూర్యమోహన్, గొలకోటి వెంకటేష్, ఆకేటి వెంకటేశ్వరావు, ముత్తాబత్తుల శ్రీను, లంకే వెంకట్రావు, సూదా చిన్నబ్బులు, బసవా ప్రకాష్, నాగిరెడ్డి రాంబాబు, ఆకేటి శ్రీను, ఆకేటి పళ్లంరాజు తదితరులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు రైతులు జనసైనికులు నాయకులు వీరమహిళలు పాల్గొన్నారు.