మాడుగుల జనసేన ఆధ్వర్యంలో జాతీయ రైతు దినోత్సవం

మాడుగుల, జాతీయ రైతు దినోత్సవం సందర్బంగా, మాడుగుల నియోజకవర్గంలో వివిధ గ్రామాల్లో మాడుగుల నియోజకవర్గ జనసేనపార్టీ నాయకురాలు సురేఖ వీరా ఆధ్వర్యంలో జనసేనపార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశానుసారం జాతీయ రైతు దినోత్సవ కార్యక్రమం చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాడుగుల మండల జనసేనపార్టీ కార్యకర్తలు మరియు నాయకులు, జిల్లా రూరల్ ప్రోగ్రాం కమిటీ సభ్యులు మురిగిటి సత్తిబాబు(దయా యాదవ్) మరియు దాసరి అచ్యుతరావు తదితరులు పాల్గొన్నారు.