‘ఎఫ్‌ 2’కు జాతీయ స్థాయి అవార్డు

గతేడాది జనవరిలో విడుదలైన వెంకటేష్, వరుణ్‌ తేజ్‌లు హీరోలుగా అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఎఫ్‌ 2 జాతీయ స్థాయి అవార్డు సొంతం చేసుకుంది.  ఫీచర్ ఫిలిం కేటగిరీలో ఎఫ్‌ 2కు జాతీయ స్థాయి అవార్డు లభించింది. హిందీతో పాటు ప్రాంతీయ భాషల సినిమాలకు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ అవార్డులను ప్రకటించింది. ఈ క్రమంలో అవార్డు సాధించిన ఏకైక తెలుగు సినిమా ‘ఎఫ్‌ 2’ కావడం విశేషం.

ఎఫ్‌ 2 ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కింది. 2019 సంక్రాంతికి విడుదలైన ఈ మూవీ ఆ సీజన్‌లో బిగ్గెస్ట్‌ కలెక్షన్ గ్రాసర్‌గా నిలిచింది. ఇక ఈ మూవీని ఇప్పుడు హిందీలో రీమేక్ చేస్తుండగా.. తెలుగులో ఎఫ్‌ 2 సీక్వెల్‌ని తెరకెక్కించనున్నారు అనిల్‌.