కరోనా నుంచి కోలుకుంటున్న నవనీత్ కౌర్

ప్రముఖ టాలీవుడ్ మాజీ నటి, ఎంపీ నవనీత్ కౌర్ రాణా ఆరోగ్యం మెరుగవుతోంది. కరోనా వైరస్ బారి నుంచి తాను వేగంగా కోలుకుంటున్నట్లు మహారాష్ట్ర, అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ తెలిపారు. దాదాపు 10 రోజుల కిందట ఆమె కుటుంబంలో 12 మంది సభ్యులకు కోవిడ్19 పాజిటివ్‌గా తేలడం కలకలం రేపింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా ఆమె ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించింది. దీంతో ఆమె ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తమయింది.

తన ఆరోగ్య పరిస్థితిపై నటి నవనీత్ కౌర్ వీడియో పోస్ట్ చేశారు. కరోనా నుంచి వేగంగా కోలుకుంటున్నానని, తనను ఐసీయూ నుంచి జనరల్ వార్డుకు మార్చారని చెప్పారు. కుటుంబసభ్యులు కూడా కరోనా నుంచి కోలుకుంటున్నారని తెలిపారు. అభిమానుల ఆశీస్సులతో, డాక్టర్లు, వైద్య సిబ్బంది చొరవతో ఆరోగ్యం మెరుగుపడిందన్నారు. గత గురువారం ఆమె ఆరోగ్యం క్షీణించడంతో ముంబైలోని లీలావతి ఆస్పత్రికి తరలించి నవనీత్ కౌర్‌కు చికిత్స అందిస్తున్నారు. త్వరలోనే పూర్తిగా కోలుకుని మళ్లీ ప్రజాసేవ మొదలుపెడతానని అమరావతి ఎంపీ పేర్కొన్నారు.