నెల్లూరు ములాపేటలోని గీతావైభవ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిత్యం భగవద్గీత పారాయణం నిర్వహిస్తున్న నజీర్ భాషా, జనసేన పార్టీకి మద్దతు తెలియజేశారు.
జనసేన నాయకులు కిషోర్ గునుకుల, విజయలక్ష్మి లు అక్కడికి విచ్చేసి, ఏకాదశి సందర్భంగా అగ్నిహోత్రం నిర్వహించారు. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో జనసేన పార్టీ సనాతన ధర్మ పరిరక్షణకు కట్టుబడి ఉందని నజీర్ భాషా అభిప్రాయపడ్డారు. మార్చి 14న పిఠాపురంలో జరగనున్న జనసేన ఆవిర్భావ సభకు పాల్గొంటామని, సభ విజయవంతం కావాలని, బస్సు సౌకర్యం అందించిన వేములపాటి అజయ్ గారికి కృతజ్ఞతలు తెలిపారు. భగవద్గీత పారాయణం ద్వారా సనాతన విలువలను ప్రజలకు చేరవేయాలనే సంకల్పంతో నజీర్ భాషా చేస్తున్న కృషిని జనసేన పార్టీ అభినందించింది. భవిష్యత్తులో సనాతన ధర్మాన్ని కాపాడేందుకు జనసేన పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని గునుకుల కిషోర్ పేర్కొన్నారు.

Share this content:
Post Comment