వ్యక్తిగత స్వలాభం కోసం ఎన్డీఏ కూటమి అభ్యర్థిని వాడుకుంటున్నారు

ప్రచార కమిటీ, విజయవాడ అర్బన్ కోఆర్డినేటర్ తిరుపతి సురేష్ మాట్లాడుతూ.. పశ్చిమ నియోజకవర్గంలో కొందరు వ్యక్తిగత స్వలాభం కోసం ఎన్డీఏ కూటమి అభ్యర్థిని వాడుకుంటున్నారు..? పశ్చిమ నియోజకవర్గ జనసేన పార్టీ ఆఫీసు అని పశ్చిమ నియోజకవర్గ జనసేన క్యాడర్ కి తెలియకుండా ఎలా ప్రారంభిస్తారు? అని ప్రశ్నించారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థి అక్కడికి వచ్చి జనసేన క్యాడర్ ఏది అని అడిగితే మీరు తెల్ల మోకాలు వేయలేదా..? ఆయన వస్తున్న రెండు నిమిషాలు ముందు మీరు పశ్చిమ నియోజకవర్గం పార్టీ ఆఫీసు అని చెప్పి బోర్డు ఎందుకు పెట్టారు..? పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు పశ్చిమ నియోజకవర్గంలో డివిజన్ ప్రెసిడెంట్లు జనసేన క్యాడర్ మొత్తం ఎన్డీఏ కూటమి అభ్యర్థి సృజనా చౌదరి గారికి పార్లమెంట్ అభ్యర్థి చిన్ని గారికి పని చేస్తున్నారు. కానీ కొందరు వ్యక్తులు వాళ్ళ స్వలాభం కోసం మిమ్మల్ని మభ్యపెడుతున్నారు. పశ్చిమ నియోజకవర్గంలో జనసేన పార్టీని అడ్డంపెట్టుకుని మీ ఎదుగుదల కోసం పార్టీని దెబ్బతీసే పని చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదు మేము పార్టీ ఆఫీసుకి తెలియజేస్తాం.. ఇంకొక పనికిమాలిన ఎదవ వచ్చి రోజూ చిరంజీవి గారి గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేవాడు అయిపోయాడు. జనసేన పార్టీలో లేకపోతే నువ్వెక్కడున్నావ్ రా బాబు అని ప్రశ్నించారు 34, 35,37, 38, 39, 40, 41, 42, 43, 45, 46, 47, 49, 50 52, 54, 55, 56 ఆకుల రవిశంకర్, ప్రదీప్ రాజ్, తమ్మిన లీలా కరుణాకర్, ఏలూరు సాయి శరత్, శ్యామ్, కూరాకుల సురేష్, తిరుపతి అనూష, బొమ్ము రాంబాబు, వేంపల్లి గౌరీ శంకర్, బాదర్ల శివ, గన్ను శంకర్, పల్లాంటి అది, దేవకి, చిన్నబాబు, బోల్లేపల్లి కోటేశ్వరరావు, కంది నాని, రెడ్డిపల్లి గంగాధర్, డివిజన్ అధ్యక్షులు, ఇటీ విభాగం మంత రాజేష్, 44వ డివిజన్ ఉపాధ్యక్షులు, పోలిశెట్టి శివ, కార్తీక్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.