వినతిపత్రం ఇచ్చినా నిర్లక్ష్యం: కనపర్తి మనోజ్ కుమార్

ప్రకాశం జిల్లా, కొండపి నియోజకవర్గంలో పొన్నలూరు మండలంలో రావులకొల్లు గ్రామంలో రెండు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు ప్రమాదకరంగా ఉన్నాయి. స్తంభాలు ఏర్పాటు చేసారు కానీ విద్యుత్ తీగలు వేయలేదు. గ్రామస్తులు అధికారులను అడిగితే నిధులు లేవు అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారు, డ్రైనేజీ సమస్య కూడా ఉంది, సైడ్ కాలవలు లేకపోవడం వలన ఎక్కడ నీరు అక్కడే నిల్వ ఉండి ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. పైరెడ్డిపాలెం గ్రామంలో ప్రమాదకరంగా విద్యుత్ స్తంభం ఉంది అని అధికారులకు ఎన్నోసార్లు వినతిపత్రం ఇచ్చినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రజల ప్రాణానికి నష్టం జరిగితే దానికి మాత్రం కారణం అధికారులు మరియు వైసిపి నాయకులు బాధ్యత వహించాల్సి వస్తుందని పొన్నలూరు మండల జనసేన పార్టీ అధ్యక్షులు కనపర్తి మనోజ్ కుమార్ తెలియజేశారు. ఆ గ్రామంలో పర్యటించిన వారిలో ఉపాధ్యక్షులు కర్ణ తిరుమల రెడ్డి, ప్రధాన కార్యదర్శి షేక్ మహబూబ్ బాషా, కార్యదర్శి కాకాని ఆంజనేయులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.