ముఖ్యమంత్రి జగన్ కు నెల్లూరు జనసేన సవాల్

నెల్లూరు, 175 కాదు ఒక్క నియోజకవర్గంలో అయినా పరదాలు లేకుండా ప్రజల మధ్య తిరగగలవా జగన్..? విశ్వసనీయత తర్వాత సంగతి గాని ఒకటో తారీకు ఉద్యోగస్తులకు జీతాలిచ్చావా జగన్..? అంటూ జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి జిల్లా గునుకుల కిషోర్ ఆధ్వర్యంలో బుధవారం గాంధీ బొమ్మ వద్ద నిరసన చేసారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…

  • 175 నియోజకవర్గాల్లో ఒక్క నియోజకవర్గంలో కూడా పరదాలు లేకుండా తిరగలేని జగన్ ఈరోజు విశ్వసనీయత గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉంది.
  • దేవుని దయతో చల్లని ఆశీస్సులతో బిడ్డ జగన్ 175 కు 175 సాధిస్తానని సోది చెప్పారు.
  • అనంతరం ఊగిపోతూ ప్రతిపక్షాల వ్యూహాల అర్థం కాక సవాళ్లు విసిరాడు.
  • మేము కూడా పార్టీ తరపున సవాలు విసురుతున్నా 175 నియోజకవర్గాలలో ఒక్క దానిలో నైనా పరదాలు సెక్యూరిటీ లేకుండా తిరగ గలవా జగన్.
  • విశ్వసనీయత అంటే మైకును కొట్టడం బటన్ నొక్కడం కాదు సిపిఐ దత్తపుత్ర.
  • నమ్మకం సంపాదించు కోవటం అని ఎన్నికల ముందు ఎన్నో వాగ్దానాలు చేసి నిలబెట్టుకోవడం చేతకాని మీరు ఆ మాట అనటానికి అనర్హులు.
  • మీ బాబాయ్ హత్య కేసులో కుటుంబ సభ్యులకే లేని నమ్మకం ప్రజలకు మీ మీరెక్కడ ఉంది.
  • యువతను జాబ్ కాలండర్ ఇవ్వక యువతనూ మోసం చేసిన జగన్, ఉద్యోగస్తులు సిపిఎస్ రద్దు చేస్తానని మోసం చేసిన జగన్, ఒకటో తారీకు కాదు పదో తారీకు కూడా జీతాలు ఇవ్వలేని జగన్ మున్సిపల్ ఉద్యోగస్తులు వేతనాలు ఇవ్వలేని జగన్, ఇబ్బందికర పరిస్థితుల్లో రైతులను రుణాలు ఇవ్వలేని జగన్, టార్గెట్ గా పెట్టి పింఛన్లు మరియు సంక్షేమ పథకాలు ఎత్తేస్తున్న జగన్ విశ్వసనీయత గురించి మీరే మాట్లాడాలి.
  • జిల్లాలో ఇప్పటికే 10 నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు మీకు అడ్డం తిరగడంతో లేనిపోని కేసులతో ఇబ్బంది పెడుతున్న మీరు విశ్వసనీయత గురించి మాట్లాడడమే విడ్డూరం.
  • పార్టీలో ఉండగా ఏ పని చేసినా నేరం కాదు పార్టీని వదిలితే నేరంగా పరిగణించబడే జగన్ విశ్వసనీయత ఇదే.
  • 175 నియోజకవర్గాల తర్వాత సంగతి మా 10 నియోజకవర్గాల్లో శాంతిబంధాలు కొరవై ఎవడు ఎవడిని పొడుస్తాడు, ఎవడు ఎక్కడ చంపుతారు అనే బెంబెలెత్తి పోతుంటే మీ మీద విశ్వసనీయత ఎలా ఉంటుంది జగన్.
  • ప్రతి పార్టీకి ఒక ప్రణాళిక ఉంటుంది.దాని ప్రకారం ఎక్కడ పోటీ చేయాలో మేట చూసుకుంటాం అది మీకు అనవసరం.
  • ఎన్నికల ముందు లేనిపోని హామీలతో ప్రజలను ముద్దాడుతూ తిరిగిన జగన్ పరదాలు లేకుండా ఒక్క నియోజకవర్గంలో అయినా ఈరోజు తిరగగలడా అని మేము అడుగుతున్నాము.
  • రాజధాని,అభివృద్ధి ఊసులు గాలికి వదిలిన జగన్ ముందు తమ నేతల విశ్వాసాన్ని కోల్పోకుండా చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
  • అక్రమార్జన పదవికాంక్ష ధ్యేయంగా వ్యవహరిస్తున్న ఈ జగన్మోహన్ రెడ్డిని రానున్న సార్వత్రిక ఎన్నికల్లో సరైన గుణపాఠం చెప్పి ప్రజలందరూ ఇంటికి పంపాలని కోరారు.

ఈ కార్యక్రమంలో గునుకుల కిషోర్, నెల్లూరు నగర అధ్యక్షులు సుజయ్ బాబు, జనసేన నాయకులు లక్ష్మి, కంథర్, షాజహాన్, ప్రశాంత్ గౌడ్, హేమంత్ యాదవ్, ప్రసన్న, వర్షన్, వెంకీ, ఖలీల్, పవన్ కళ్యాణ్, హరి, మౌనీష్, రాజా, ప్రతాప్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.