ఆవిర్భావ సభ పోస్టర్ ఆవిష్కరించిన నెల్లూరు జనసేన నాయకులు

నెల్లూరు, జనసేన పార్టీ ఆవిర్భావ సభ పోస్టరును నెల్లూరు గోమతి నగర్ లో సోమవారం జనసేన నాయకులు ఆవిష్కరించడం జరిగింది. జనసేన పార్టీ పేదల సంక్షేమం కోసం ఏర్పాటుచేసిన పార్టీ అని ఆ పార్టీ సీనియర్ నేత, కోర్ కమిటీ సభ్యుడు నూనె మల్లికార్జున యాదవ్ అన్నారు. ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విలువలు విశ్వసనీయతకు అద్దం పట్టే పార్టీ జనసేన అని వ్యాఖ్యానించారు. పార్టీని స్థాపించిన అనతకాలంలోనే ప్రజల ఆదరణ పొందడం జరిగిందన్నారు. అందుకే గత ఎన్నికల్లో 21 సీట్లకు గాను 21 సీట్లు గెలుపొందడం జరిగిందన్నారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను క్రమం తప్పకుండా అమలు చేస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ – జిల్లాలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అట్టహాసంగా నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు. క్షేత్రస్థాయిలో జెండా పండుగ అంబరాన్ని అంటేలా చేయాల్సి ఉంది అన్నారు. ప్రతి కార్యకర్త గర్వంగా చెప్పుకునే పార్టీగా నిలవాలని, జిల్లాలో ఇప్పటికే సభ్యత నమోదులో రికార్డు సాధించాం అన్నారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సొంతం చేసుకుంటామని తెలిపారు. జనసేన పార్టీ జాతీయ మీడియా అధికార ప్రతినిధి, టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ సారథ్యంలో జిల్లాలో పటిష్టమైన పార్టీగా రూపుదిద్దుకుంటుందన్నారు. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈనెల 14వ తేదీన పిఠాపురం ప్రత్యేక బస్సుల ద్వారా బయలుదేరి వెళ్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో నూనె మల్లికార్జున యాదవ్, సుందరామి రెడ్డి, గునుకుల కిషోర్, వై రవి, కృష్ణారెడ్డి, ఆఫీస్ ఇంచార్జి జమీర్ మరియు జనసేన నాయకులు, వీరమహిళలు పాల్గొన్నారు.

Share this content:

Post Comment