ఎమ్మెల్యే కోటంరెడ్డి నెల్లూరుకు సాధించిన అభివృద్ది శూన్యం: గునుగుల కిషోర్

  • నెల్లూరు రూరల్ లో తిరుగులేని నాయకుడిని అని చెప్పుకుంటున్న ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రూరల్ కి సాదించిన అభివృద్ది శూన్యం
  • తండ్రి పేరు చెప్పుకుని ఒక్క అవకాశం అంటూ గెలిచిన జగన్ తండ్రి పరువు తీస్తున్నారు
  • ఈ ఏరియాలో మౌలిక వసతులు కల్పించక ప్రజలను నానా అవస్థలకు గురి చేస్తున్నారు

నెల్లూరు రూరల్: ఎడతెరిపిలేని వర్షాల కారణంగా ఇబ్బంది పడుతున్న వైయస్సార్ నగర్ స్థానికుల అభ్యర్థన మేరకు జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ ఆ ఏరియాలో సందర్శించారు. స్థానికంగా ప్రజలు పడుతున్న ఇబ్బందులను వైయస్సార్సీపీ నాయకులను తీరును ప్రజలే ఎండగట్టారు. వారు చెప్పిన ముఖ్యాంశాలు..

* పది సంవత్సరాలు గడుస్తున్నా మంచినీటి సౌకర్యం ఏర్పడుచరటంలో విఫలం అయ్యారన్నారు..

*రూరల్ ఎమ్మెల్యే పై రోడ్డు దాకా వస్తారు…ఇళ్ల దాక వస్తే కదా మేము ఎంత ఇబ్బంది పడుతున్నాము తెలుస్తుంది అన్నారు..

*ఇంటింటికి తిరిగిన వైసిపి కార్పొరేటర్ గెలిచిన తర్వాత కనబడే ఊసే లేదు..

వైఎస్సార్ నగర్ స్థానికులు ఇబ్బంది పడుతున్న సమస్యల్లో ముఖ్యమైనవి ప్రధానమైనవి:

*ప్రాంతం ఏర్పడి పది సంవత్సరాలు గడుస్తున్నా రోడ్లు ఏర్పాటులో విఫలమైన వైసీపీ ప్రభుత్వం..

*మంచినీటి వసతి కల్పించక నీరు కావాలంటే ట్యాంకర్ తో తోలే పరిస్థితి ఇంకా జరుగుతూనే ఉంది..

*ట్యాంకర్లు కూడా వీధి చివర ఉన్న డ్రమ్ముల్లో పోసి పోవాల్సిందే కానీ ఇంటికి చేరే పరిస్థితి లేదు..

*ఈ రోడ్ల అడ్డం పెట్టుకొని ఇంటికి వచ్చి ఇవ్వాల్సిన రేషన్ బియ్యం స్లిప్పు తీసుకొని కిలోమీటర్ నడిచి వెళ్లి తీసుకోవాల్సి వస్తుంది…

*డ్రైనేజీ కాలవల లేక ఉన్న దుర్గంధం అంతా విధుల్లోకి వచ్చి భయంకరమైన పరిస్థితి..

*అక్కడ ఉన్న చిన్న పిల్లల కంటే స్థానికంగా తిరుగుతున్న పందుల సంఖ్య ఎక్కువగా ఉండటం కార్పొరేషన్ దాని నిర్లక్ష్యం చేయడం అమానుషం..

*చెట్లు, పుట్టా నగర ఉద్యానవనం లో విరివిగా ఉన్న పాములు ఇళ్ళలోకి దూరి భయాందోళనకు గురి అవుతున్నారు..

*ప్రాంతంలో ఒకసారి కరెంటు పోతే 24 గంటల తర్వాత కూడా వచ్చే పరిస్థితి లేదని వాళ్ళు వాపోయారు

ఈ సందర్భంగా గునుకుల కిషోర్ మాట్లాడుతూ జనసేన పార్టీ తరఫున ప్రధాన కార్యదర్శి స్థానిక జనసేన నాయకులు మీ మద్దతుగా ఉంటారని రానున్న రోజుల్లో కార్పొరేషన్ కి మరియు కలెక్టర్ గారికి మీ సమస్యలను మేము తెలియజేస్తామని హమీ ఇచ్చి, మీరంతా తోడు వస్తే సమస్యల పరిష్కారానికి జనసేన పార్టీ తరఫున పోరాడుతామని తెలియజేశారు. స్థానికుల ఓట్లతో గెలిచిన వైసిపి నాయకులు వారిని పట్టించుకోకవడం అనుమానుషం అని తెలిపారు నెల్లూరు రూరల్ 30 డివిజన్ కార్పొరేషన్ పరిధిలో ఇలాంటి అడవిని తలపించే ప్రాంతం ఉండడం ఘోరం అని తెలిపారు. నెల్లూరు రూరల్ లో తిరుగులేని నాయకుడిని అని చెప్పుకుంటున్న ఎమ్మెల్యే రూరల్ కి సాదించిన అభివృద్ది శూన్యం. రానున్న రోజుల్లో ప్రణాళిక బద్ధంగా ఈ ప్రాంత అభివృద్ధికి పోరాడుతామని చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ తో పాటు శీను, కరీమ్, కంథర్, అమీన్, ప్రశాంత్ గౌడ్, రాజా తదితరులు పాల్గొన్నారు.