నాదెండ్లను మర్యాద పూర్వకంగా కలిసిన నేరేళ్ళ సురేష్

గుంటూరు పట్టణ జనసేన పార్టీ అధ్యక్షులు నేరేళ్ళ సురేష్ శుక్రవారం జనసేనపార్టీ రాష్ట్ర పి.ఏ.సి ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ని వారి కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసి అభినందనలు తెలియజేయటం జరిగినది. ఈ సందర్భంగా మనోహర్ తోటి సురేష్ కొద్దిసేపు ముచ్చటించినారు. పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని జనసేన సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్ళాలని నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ నాయకులను సమన్వయం చేసుకుంటూ ముందుకు నడవాలని మనోహర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టి గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పు వెంకటరత్తయ్య, గుంటూరు పట్టణ ఉపాధ్యక్షులు చింతా రేణుకా రాజు, బుడంపాడు సొసైటీ మాజి అధ్యక్షులు ఆకుల వీరాఘవయ్య, నాదెండ్ల రాము, ఆకుల మల్లి తదితరులు పాల్గొన్నారు.