Hyderabad: కొత్త భవనం అవసరం లేదు కనీసం మరమ్మత్తులు చేయించండి: జనసేన వీరమహిళా విభాగం రాష్ట్ర వైస్ చైర్ పర్సన్ నీహారిక

కొత్త భవనం అవసరం లేదు కనీసం మరమ్మత్తులు చేయించండి… శిథిలమైన సీలింగ్ నుండి ఫ్యాన్ ఊడి పడి వైద్యురాలి తలకు గాయం… ఉస్మానియా ఆసుపత్రిలో వైద్యుల తలలకు హెల్మెట్లు… తెలంగాణ ప్రభుత్వానికి సిగ్గుచేటు!!
ఎన్నో దశాబ్దాల చరిత్ర కలిగిన ఉస్మానియా ఆసుపత్రి దుస్థితి దయనీయంగా ఉంది. వైద్యులకే రక్షణ లేని ఆసుపత్రిలో రోగుల పరిస్థితి ఏమిటని జనసేన వీరమహిళా విభాగం రాష్ట్ర వైస్ చైర్ పర్సన్ నీహారిక అన్నారు.