భీమవరం నుండి భద్రాచలంకు కొత్త బస్సు సర్వీస్

*ప్రారంభించిన ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పల నాయుడు..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ భీమవరం నుండి భద్రాచలం కు కొత్త సర్వీసు ఏలూరు డిపో నందు ప్రారంభోత్సవం జరిగింది.. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ శ్రీ రెడ్డి అప్పల నాయుడు గారు హాజరయ్యారు.. తొలుత ఆయనకు ఏలూరు కొత్త బస్టాండ్ లో ఆర్టీసీ ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు.. అనంతరం ఆయన చేతుల మీదుగా ఈ బస్సు సర్వీస్ ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.. ఈ సందర్భంగా రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక కొత్త బస్సులు కొత్త రూట్ల నందు ప్రవేశపెట్టడం జరిగిందని, అదేవిధంగా భద్రాచల శ్రీరామచంద్రులు దర్శనానికి భీమవరం డిపో నుండి గతంలోనే ఒక బస్సు పెట్టడం జరిగిందని, మళ్లీ నేడు ఏలూరు పార్లమెంటు సభ్యులు పుట్టా మహేష్ యొక్క ఆదేశాల మేరకు రాత్రిపూట కూడా ఒక బస్సుని పెట్టాలని, ఈ నూతన సర్వీస్ (బస్సు) ని ఏర్పాటు చేయడం జరిగిందని, ఇంకా దైవదర్శనాలకి అనేక బస్సులను అనేక ప్రాంతానికి త్వరలో ప్రారంభిస్తామని, ప్రతి ఒక్క ప్రయాణికుడు ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని, ఆర్టీసీని మరింత ప్రోత్సహించాలని, ప్రతి ఒక్కరూ క్షేమంగా ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణం చేస్తూ తమ గమ్య స్థానాలకు చేరుకోవాలని ఆయన తెలిపారు.. భీమవరం డిపో మేనేజర్ పి.ఎన్.వి.ఎం .సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ ఇంతకుముందు భద్రాచలం పగలు సర్వీస్ పెట్టామని, అది బాగా విజయవంతమైందని, ఆ బస్సు ప్రజాదరణ బాగా పొందిందని, అదే విధంగా ఈ బస్సు భీమవరంలో రాత్రి 8 గంటలకు బయలుదేరి ఏలూరు 10 గంటలకు వచ్చి భద్రాచలం మూడు గంటలకు చేరుతుందని, తిరిగి మరుసటి రోజు ఉదయం 8 గంటలకు బయలుదేరి, ఒంటి గంటకి ఏలూరు చేరుకొని మూడు గంటలకి భీమవరం చేరుకుంటుందని, ఈ సర్వీస్ ని కూడా ప్రజల ఆదరించాలని ఆయన కోరారు.. ఈ కార్యక్రమంలో ఏలూరు డిపో మేనేజర్ శ్రీమతి బి. వాణి, ఏ.ఎం.టి జి. మురళి, ఎ0.ఎఫ్. ఐ. ప్రేమ్ కుమార్, పి.ఆర్వో . నరసింహం పలువురు ఆర్టీసీ కార్మికులు, నాయకులు పాల్గొన్నారు.

WhatsApp-Image-2025-06-13-at-12.47.17-PM-1024x576 భీమవరం నుండి భద్రాచలంకు కొత్త బస్సు సర్వీస్

Share this content:

Post Comment