ఈఎంఐలో రూ.3.50లక్షలకే కొత్త ఇల్లు..

ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా నిరుపేదల సొంతింటి కల సాకారం కానుంది. కేంద్ర ప్రభుత్వం ఇల్లు లేని నిరుపేదలకు సరికొత్త ప్లాన్ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ పథకం కింద పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని పేదలు, మధ్యతరగతి ప్రజలు ఇల్లు కొనుగోలు చేసేలా వెసులుబాటు తీసుకువచ్చింది. తొలిసారి ఇల్లు కొనుగోలు చేసే వారికి వడ్డీ రాయితీ లభిస్తుంది.ఈ పథకం వచ్చే ఏడాది మార్చి నెల చివరి వరకు అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం ఈ పథకం ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వపు హౌసింగ్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ వినూత్నంగా ముందుకు వెళ్తోంది. ఈ స్కీమ్ కింద ప్రజల కోసం ఇల్లు కట్టించి విక్రయిస్తోంది. 19 పట్టణాల్లో 3,500కు పైగా ఇళ్లను నిర్మించింది. వీటిని ప్రజలకు విక్రయిస్తోంది. కొనుగోలు చేయాలని భావించే వారు సెప్టెంబర్ 1 నుంచే బుకింగ్ చేసుకోవాలని సూచించింది. కేవలం రూ.3.5 లక్షలకే కొత్త ఇంటిని పొందొచ్చు. అక్టోబర్ 15లోపు కొత్త ఇంటి కొనుగోలుకు సంబంధించి దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. అయితే ఈ పథకానికి కొన్ని కండీషన్స్ పెట్టింది.ఈ పథకం ద్వారా ఇల్లు కొనుగోలు చేయానుకునేవారి వార్షిక ఆదాయం రూ.3.5 లక్షలకు లోపు ఉండాలి. పేద మధ్యతరగతి ప్రజలు మాత్రమే అర్హులు. అర్హులకు మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది యూపీ ప్రభుత్వం. రూ.3.50 లక్షలకు ఇళ్లు కట్టి ఇవ్వడమే కాదు ఆ సొమ్మును ఒకేసారి చెల్లించకుండా మూడేళ్లలోపు చెల్లించేలా ఛాన్స్ కూడా ఇచ్చింది. దాంతో ఉత్తర ప్రదేశ్ లో ఈ హౌసింగ్ స్కీమ్ బాగా పాపులర్ అయ్యింది. ఇలాంటి విధానాన్ని ఇతర రాష్ట్రాలు కూడా అమలు చేయాలని పలు రాష్ట్రాల ప్రజల నుంచి ఒత్తిడి వస్తుంది.