*విద్యుత్ అభివృద్ధికి నూతన ట్రాన్స్ఫార్మర్ల ప్రారంభించిన బొమ్మిడి నాయకర్
*మేడే వేడుకల్లో నాయకుల సందడి
నరసాపురం పట్టణంలోని పలు వార్డుల్లో పాత కాలనీ, కొత్త కాలనీ, హౌసింగ్ బోర్డ్, కోర్టు ప్రాంతాలలో ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని నిరవధిక విద్యుత్ సరఫరా అందించేందుకు నూతన విద్యుత్ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లను ప్రభుత్వం విప్ మరియు నరసాపురం శాసనసభ్యులు బొమ్మిడి నాయకర్ ప్రారంభించారు. అనంతరం ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారు మేడే సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని, కార్మికుల హక్కులు, సేవలు అమూల్యమైనవని ప్రస్తావించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు కూడా పాల్గొని కార్మికుల శ్రమకు సెల్యూట్ చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు. నేతలు కోటిపల్లి వెంకటేశ్వరరావు, కోటిపల్లి సురేష్, వలవల నాని, ఆకన చంద్రశేఖర్, గంట కృష్ణ, వాతాడి కనకరాజు, గుబ్బల మారాజు, నిప్పులేటి తారక రామారావు, కౌన్సిలర్లు తోట అరుణ, కొప్పాడ కృష్ణవేణి, బొమ్మిడి సూర్యకుమారి, భారతి సురేష్, వట్టిప్రోలు సతీష్ మరియు నియోజకవర్గ జనసేన, టిడిపి, బిజెపి నాయకులు, జన సైనికులు, మహిళలు పాల్గొన్నారు.
Share this content:
Post Comment