అనుశ్రీ ముఖ్య అతిధిగా నూతన ఓటు నమోదు కార్యక్రమం

రాజమండ్రి సిటీ, స్థానిక కాంప్లెక్స్ వద్ద ఉన్న ఆదిత్య డిగ్రీ కాలేజీలో అనుశ్రీ సత్యనారాయణ ముఖ్య అతిథిగా ఓటు అవగాహన సదస్సు మరియు నూతన ఓటు నమోదు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. జనసేన పార్టీ యువ నాయకులు బయ్యపు నీడి సూర్య ఆహ్వానం మేరకు జనసేన పార్టీ రాజమండ్రి సిటీ ఇన్చార్జి అనుశ్రీ సత్యనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటు హక్కు అనేది చాలా విలువైనది ఓటు హక్కు ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని విద్యార్థులకి సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి పైడిరాజు, కార్యదర్శి అల్లాటి రాజు, గుణ్ణం శ్యాంసుందర్ జాయింట్ సెక్రెటరీ దేవకివాడి చక్రపాణి మరియు జనసేన నాయకులు పల్లంటి సంజీవ్, విక్టరీ వాసు, నర్సిపూడి రాంబాబు, ప్రవీణ్, మొన్డేటి ప్రసాద్, లోవరాజు మరియు సూర్య మిత్రబృందం, జనసైనికులు పాల్గొని విజయవంతం చేశారు.