న్యూస్ రిపోర్టర్ వీరేంద్రని సన్మానించిన నిడదవోలు జనసేన

నిడదవోలు, రెండు రోజుల క్రితం తెలుగు పాతూరుకి చెందిన యువతి తల్లిదన్డ్రులు మందలించినందుకు మనస్థాపానికి గురై అత్తిలి కాలువ వంతెన పైనుండి దూకి ఆత్మహత్యా ప్రయత్నం చేయగా అటుగా వెళ్తున్న మహా న్యూస్ రిపోర్టర్ వీరేంద్ర ప్రాణాలకు తెగించి యువతిని కాఆపాడడం జరిగింది. ప్రమాదం జరిగాకా స్పందించే నేటి సమాజంలో విలేకరిగా తన భాద్యతను ప్రాణాలు తెగించి జర్నలిజం విలువలను పెంచిన శిరంగం వీరేంద్ర వీరత్వాన్ని గుర్తించి నిడదవోలు నియోజకవర్గ జనసేన పార్టీ జిల్లా, మండల స్థాయి నాయకుల ఆధ్వర్యంలో సన్మానించడం జరిగింది. వారి సహసానికి స్పూర్తి నింపేలా ప్రభుత్వం వారు గౌరవ ప్రసంసాపత్రాన్ని ఇవ్వవలసిందిగా సూచిస్తున్నామని తెలిపారు.