నిడదవోలు మండల కమిటీ సమావేశం

నిడదవోలు నియోజకవర్గం, నిడదవోలు మండలంలో క్రొత్తగా నియమించిన నిడదవోలు మండలకమిటితో పార్టీ ప్రణాళికల కోసం మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పోలిరెడ్డి వెంకటరత్నం మాట్లాడుతు మనమందరం గ్రామస్థాయిలో పార్టీ బలోపేతం కోసం గ్రామ కమిటీలు, బూత్ కమిటీలు త్వరలో ఏర్పాటు చేద్దాం అని,దానికి కలిసి పనిచేద్దాం అని మాట్లాడారు. దానితో పాటు క్రొత్తగా నియమితమైన మండల కమిటీకి పోలిరెడ్డి వెంకటరత్నం, రంగా రమేష్ చేతుల మీదుగా సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రంగారమేష్, ఇంద్రగౌడ్, మేడా పూర్ణ, కర్రీ వినోద్, షేక్ రఫీ, షబ్బీర్, రాజా, కస్తూరి సుబ్బారావు, వద్దిరెడ్డి రాజు జిల్లా ప్రోగ్రామ్స్ కమిటీ యామన కాశి, యడ్లపల్లి సత్తిబాబు మండల కమిటీ సభ్యులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.