హుస్సేన్ సాగర్‌ వద్ద నైట్ బజార్లు!

హైదరాబాద్‌ అభిృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. అభివృద్ధితోపాటు పర్యాటక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించింది. పర్యాటకులకు ఆహ్లాదాన్ని కలిగించడానికి దుర్గం చెరువుపై తీగల వంతెన ఏర్పాటు చేసింది. దీనితోపాటు మహానగరంలో బయోడైవర్సిటీ పార్కులను ఏర్పాటు చేసింది. పట్టణ ప్రాంతంలోని ప్రజలు సేదదీరేందుకు గ్రీన్ పార్కులను కూడా ఏర్పాటు చేస్తోంది. ఇప్పుడు తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకోనుంది.

హైదరాబాద్‌లో పర్యాటక అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ తెలిపారు. హుస్సేన్ సాగర్ పరిధిలో నైట్ బజార్లను ఏర్పాటు చేస్తామని అన్నారు. పీపీఈ పద్ధతిలో నైట్ బజార్ల ఏర్పాటుకు టెండర్లను ఆహ్వానిస్తామని వెల్లడించారు. అదే పద్ధతిలో ఈ బజార్లను అభివృద్ధి చేస్తామన్నారు. బోర్డు వాక్‌, పార్కింగ్‌, సిట్టింగ్ తదితర సౌకర్యాలతో నైట్ బజార్లను ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు.