తెలంగాణలో నైట్ కర్ఫ్యూ, వీకెండ్ లాక్‌డౌన్?

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతుండడం, సెకండ్ వేవ్ ఉధృతంగా ఉండడంతో ప్రభుత్వం పరిస్థితిని సమీక్షిస్తోంది. కేంద్రం ఇప్పటికే కఠిన ఆంక్షలు అమలు చేయాలని రాష్ట్రాలను ఆదేశించింది. ఢిల్లీ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, యూపీ లాంటి రాష్ట్రాల్లో రాత్రిపూట కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. అలాగే పాక్షిక లాక్ డౌన్ కూడా అమలు చేస్తున్నారు. ఇప్పుడు తెలంగాణలోనూ రాత్రిపూట కర్ఫ్యూను, వీకెండ్ లాక్‌డౌన్ అమలు చేయాలనే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ అన్ని శాఖల ముఖ్య అధికారులతో సమీక్షిస్తున్నారు. ఈ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సంప్రదించి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలియవచ్చింది.