అంగరంగ వైభవంగా నిహారిక పెళ్లి వేడుక

మెగా డాటర్ నిహారిక నిహారిక పెళ్లి వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. కుటుంబ సభ్యుల సమక్షంలో నిహారిక కొద్ది సేపటి క్రితం జొన్నలగడ్డ చైతన్యతో ఏడడుగులు వేసింది. ఉదయ్ పూర్ లోని ఉదయ్ విహార్ రిసార్ట్ లో 3 రోజులుగా జరుగుతున్న పెళ్లి వేడుకలు కొద్ది సేపటి కిందట పూర్తయ్యాయి. సాయంత్రం సరిగ్గా 7 గంటల 15 నిమిషాలకు తలపై జీలకర్ర-బెల్లం పెట్టడంతో నిహా-చైతన్యల పెళ్లి జరిగింది.

అంతకంటే ముందు ఉదయం నుంచి భారీ హంగామా నడిచింది. నిహారిక-చైతన్యలకు హల్దీ ఫంక్షన్ (మంగళ స్నానాలు) నిర్వహించారు. ఆ తర్వాత నిహారికను పెళ్లికూతురిగా ముస్తాబు చేశారు. ట్రెడిషనల్ డిజైనరీ శారీలో నిహారిక మెరిసిపోయింది. తర్వాత చైతన్య, నిహారికలను పెళ్లి పీటలపైకి తీసుకొచ్చారు. నిహారిక తండ్రి నాగబాబు.. చైతన్య కాళ్లు కడిగి కన్యాదానం చేశారు. ఇలా పూర్తిగా తెలుగు సంప్రదాయంలో నిహారిక పెళ్లి జరిగింది. నిహారిక పెళ్లికి మెగా హీరోలంతా హాజరయ్యారు.