నిహారిక పెళ్ళి డిసెంబర్‌లో..

మెగా కుటుంబంలో త్వరలో పెళ్లి బాజాలు మోగనున్న విషయం తెలిసిందే. నటుడు నాగబాబు కుమార్తె నిహారిక వివాహం ఈ ఏడాది చివర్లో జరగనుంది. డెస్టినేషన్ వెడ్డింగ్‌గా నిహారిక పెళ్లి వేడుకని డిసెంబర్‌లో జరపాలని మెగా ఫ్యామిలీ భావిస్తుందట. ఇక వరుణ్ తేజ్ ప్రస్తుతం తన చెల్లి పెళ్ళి పనులతో బిజీగా ఉండగా, ఏ ప్రాంతంలో పెళ్లి జరపాలనే దానిపై ఓ జాబితాను సిద్ధం చేసుకుంటున్నాడని నాగబాబు ఇంగ్లీష్ మీడియాతో చెప్పుకొచ్చారు. అతి త్వరలోనే నిహారిక పెళ్లి తేదీని అఫీషియల్‌గా ప్రకటిస్తామని నాగబాబు వెల్లడించారు.