పొట్లి గ్రామంలో నిమ్మక జయకృష్ణ ఎన్నికల ప్రచారం

  • ఉమ్మడి పార్టీ నాయకులు పాలకొండ నియోజకవర్గం జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నిమ్మక జయకృష్ణ ఆధ్వర్యంలో కొనసాగుతున్న చేరికలు

పాలకొండ మండలంలో పొట్లి గ్రామం నుంచి వైఎస్ఆర్సిపి నాయకులు సర్పంచ్ గొర్ల కృష్ణ రావు తన అనుచరులతో కలిసి జనసేన అభ్యర్థి నిమ్మక జయకృష్ణ(ఎన్ కే జయ కృష్ణ) ఆధ్వర్యంలో వార్డ్ మెంబర్ గొర్లే గోవిందరావు, బెజ్జపురపు స్వాతి, బెజ్జిపురం సాంబినాయుడు మాజీ ఉప సర్పంచ్, బెజ్జిపురం శ్రీహరి నాయుడు, బేరి గణేష్ పాక్స్డై రెక్టర్, ఎస్ నాగభూషణ్ రావు, అంపిలి రాంబాబు, జి నీలార్ది, తదితరులు వైసీపీ నుంచి జనసేనలోకి చేరారు. వీరందరికీ ఎన్ కె జయ కృష్ణ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. సుమారు వంద మంది జనసేనలో చేరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కర్నెన అప్పలనాయుడు, ఉమ్మడి జిల్లాల జనసేన పార్టీ ఉపాధ్యక్షులు గర్భనా సత్తిబాబు, అరకు పార్లమెంటరీ బీసీ సెల్ కన్వీనర్ పొదిలాపు కృష్ణమూర్తి నాయుడు, వీరగొట్టం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఉదయాన ఉదయ్ భాస్కర్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయుకులు మీసాల అక్కల నాయుడు, మీసాల శ్రీనివాస్ రావు మాజీ పాక్స్ అధ్యక్షులు, బెజ్జ తదితరులు పాల్గొన్నారు.