సీతంపేట మండలం దుగ్గి గ్రామంలో పి.ఎమ్ జన్ మన్ పథకం ద్వారా రూ.8 లక్షల అంచనా వ్యయంతో 10,000 లీటర్ల సామర్థ్యం గల వాటర్ ట్యాంక్ మరియు ఇంటి ఇంటికి మంజూరైన నీటి కుళాయిలకు శంకుస్థాపన కార్యక్రమాన్ని పాలకొండ నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవ నిమ్మక జయకృష్ణ శుభారంభం చేశారు. గ్రామ ప్రజలకు త్రాగునీటి సౌకర్యం కల్పించాలనే దృష్టితో చేపట్టిన ఈ ప్రాజెక్టు గ్రామాభివృద్ధిలో మరో ముందడుగుగా నిలవనుంది.
ఈ కార్యక్రమంలో ఏఎంసి చైర్మన్ బిడ్డిక సంధ్యారాణి, జిసిసి చైర్మన్ రామారావు, ఐటిడిపి కోఆర్డినేటర్ ఇమరక పవన్ కుమార్, మండంగి విశ్వనాధం, మండంగి ప్రకాశం, గంగరాజు, ఇమరక ప్రసాద్, కురంగి అజయ్, అర్ డబ్ల్యుఎస్ అధికారులు, వివిధ హోదాలో ఉన్న నాయకులు, సచివాలయ సిబ్బంది మరియు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Share this content:
Post Comment